SSC Results: పదో తరగతి విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఎగ్జామ్స్ పూర్తైన వెంటనే రిజల్ట్.. ఎప్పుడంటే?

తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు బిగ్‌ అలర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే పరీక్షలు పూర్తైన 20 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెల 16తో పరీక్షలు ముగియగానే మూల్యాంకనం స్టార్ట్ చేసి ఈ నెల 23లోగా పూర్తి చేయాలని చూస్తోంది. అనుకున్న గడువులోపూ మార్కుల లెక్కింపు పూర్తయితే మే మొదటి వారంలోనే ఫలితాలు కూడా విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.

SSC Results: పదో తరగతి విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఎగ్జామ్స్ పూర్తైన వెంటనే రిజల్ట్.. ఎప్పుడంటే?
Ts Ssc Results 2026

Updated on: Apr 11, 2026 | 1:03 PM

ఇప్పటికే రాష్ట్రంలోని ఇంటర్ ఫలితాల విడుదల తేదీని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు పూర్తి అయిన 20 రోజుల్లోనే పదో తరగతి ఫలితాలను కూడా విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలో 2,676 పరీక్ష కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు కొనసాగుతుండగా ఇవి ఈనె 16తో ముగియనున్నాయి. అయితే ఎగ్జామ్స్ ముగిసిన వెంటనే మూల్యాంకన ప్రక్రియపై చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది.

వీలైనంత త్వరగా ఫలితాలను వెల్లడించాలనే ఉద్దేశంతో ఓ వైపు పరీక్షలు జరుగుతుండగానే ఈ నెల 3వ తేదీ నుంచే మూల్యాంకన ప్రక్రియను మొదలు పెట్టారు. ప్రస్తుతం పూర్తైన సబ్జెక్ట్‌లకు సంబంధించిన పేపర్ల మార్కలు లెక్కింపు కొనసాగుతుంది. ఇక 16వ తేదీతో ఎగ్జామ్స్ పూర్తి కానుండగా మిగతా సబ్జెక్ట్‌ల మూల్యాంకనం కూడా త్వరగా ఈ నెల 23లోపు పూర్తి చేయాలని విద్యాశాఖ ఆలోచిస్తోంది.

అయితే అనుకున్న తేదీ ప్రకారం పేపర్ల కరెక్షన్‌తో పాటు మార్కుల లెక్కింపు పూర్తయితే వచ్చే నెల మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంటే ఇక మే మొదటి వారంలోనే ఫలితాలు రానున్నట్టు తెలుస్తోంది. అయితే గతేడాదితో పోల్చుకుంటే ఈ సారి పరీక్ష ఫలితాలు కాస్తా లేట్‌గానే వస్తున్నాయి. గతంలో ఏప్రిల్ 30వ తేదీనే 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. కానీ ఈ సారి ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలే జరుగుతుండడంతో పేపర్ల కరెక్షన్‌కు సమయం పడుతుంది. దీంతో ఫలితాల విడుదల కూడా ఆలస్యం అయ్యింది.

మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us