పది పాసైతే చాలు.. హైదరాబాద్ సీసీఎంబీలో ఉద్యోగాలు, పూర్తి వివరాలివే..
CCMB Hyderabad Recruitment 2026: సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB), హైదరాబాద్ టెక్నీషియన్, డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు పదో తరగతి లేదా ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను నియమించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
CCMB Hyderabad Recruitment 2026: Job Opportunities for 10th Pass and ITI Candidates, How to Apply
సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR – Centre for Cellular and Molecular Biology), హైదరాబాద్ టెక్నీషియన్, డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి లేదా ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, రాత పరీక్ష నిర్వహించనున్నారు.
పోస్టుల వివరాలు
1. టెక్నీషియన్
ఖాళీలు: 22
అర్హతలు:
కనీసం 55% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత
ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లేదా ఫుడ్ ప్రొడక్షన్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్
లేదా
10వ తరగతి + సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అప్రెంటిస్ ట్రైనీ అనుభవం
2. డ్రైవర్
ఖాళీ: 1
అర్హతలు:
10వ తరగతి ఉత్తీర్ణత
లైట్ & హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్
కనీసం 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం
వాహన మెకానిజంపై ప్రాథమిక జ్ఞానం
ఎంపిక విధానం
టెక్నీషియన్ పోస్టులు
ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది:
స్టేజ్–1: ట్రేడ్ టెస్ట్ (నైపుణ్య పరీక్ష)
స్టేజ్–2: రాత పరీక్ష
ట్రేడ్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారినే రాత పరీక్షకు ఎంపిక చేస్తారు.