Career Guidance: త్వరగా ఉద్యోగం కావాలా? ఐతే 10వ తరగతి తర్వాత ఈ కోర్సులు చదవండి

Best Career Options After 10th Class: పదో తరగతి పూర్తి చేసిన తర్వాత సరైన కోర్సును ఎంపిక చేసుకోవడం విద్యార్థుల కెరీర్‌కు ఎంతో కీలకం. టెన్త్‌ తర్వాత మంది కోర్సులు ఎంచుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలతో పాటు అధిక వేతనాలను అందించే అవకాశాన్ని కల్పిస్తాయి. ఆసక్తులు, నైపుణ్యాలు, భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా కోర్సును ఎంచుకోవడం విజయానికి తొలి అడుగు..

Career Guidance: త్వరగా ఉద్యోగం కావాలా? ఐతే 10వ తరగతి తర్వాత ఈ కోర్సులు చదవండి
Best Courses After 10th Class

Updated on: May 31, 2026 | 4:33 PM

విద్యార్ధులకు పదో తరగతి ఎంతో కీలకం. ఇందులో వచ్చిన మార్కులే తమ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.10వ తరగతి పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు ఏ కోర్సు తీసుకోవాలి? అనే విషయంలో తికమక పడుతుంటారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు వారి భవిష్యత్ కెరీర్‌ను ప్రభావితం చేస్తాయి. సరైన కోర్సును ఎంపిక చేసుకోవడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు, అధిక వేతనం, కలల భవిష్యత్తు మీ సొంతం అవుతుంది. మీ భవిష్యత్తును పూల పాన్పు చేసే నైపుణ్యాధారిత డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు ఈ కింద ఉన్నాయి. ఈ కోర్సులకు ప్రస్తుతం యమ డిమాండ్ ఉంది.

పాలిటెక్నిక్ (డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్)

టెక్నికల్ రంగాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు పాలిటెక్నిక్ ఉత్తమ ఎంపిక. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ వంటి విభాగాల్లో డిప్లొమా చేయవచ్చు. ఈ కోర్సు ద్వారా ప్రాక్టికల్ నైపుణ్యాలు పెంపొందుతాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత జూనియర్ ఇంజినీర్ లేదా టెక్నీషియన్‌గా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (ఎంఎల్టీ)

ఆరోగ్య రంగంలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే వారికి ఈ కోర్సు అనుకూలంగా ఉంటుంది. పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ వంటి అంశాలపై శిక్షణ అందిస్తారు. ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

పారామెడికల్ కోర్సులు

ఆరోగ్య సేవల రంగంలో వేగంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా పారామెడికల్ కోర్సులకు మంచి ప్రాధాన్యం ఉంది. ఎక్స్-రే టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు. అత్యవసర వైద్య సేవల్లో కూడా అవకాశాలు లభిస్తాయి.

హోటల్ మేనేజ్‌మెంట్

హాస్పిటాలిటీ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా చేయవచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. చెఫ్, హోటల్ మేనేజర్, ఈవెంట్ ప్లానర్ వంటి కెరీర్ మార్గాలు ఇందుబాటులో ఉంటాయి.

డిజిటల్ మార్కెటింగ్

డిజిటల్ యుగంలో డిజిటల్ మార్కెటింగ్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. సోషల్ మీడియా మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO), కంటెంట్ మార్కెటింగ్ వంటి అంశాల్లో శిక్షణ పొందవచ్చు. ఫ్రీలాన్సింగ్‌తో పాటు మంచి జీతభత్యాలు కలిగిన ఉద్యోగాలు కూడా పొందవచ్చు.

గ్రాఫిక్ డిజైనింగ్ అండ్‌ యానిమేషన్

సృజనాత్మకత ఉన్న విద్యార్థులకు ఈ కోర్సు ఉత్తమ ఎంపిక. ప్రకటనలు, గేమింగ్, సినిమా, బ్రాండింగ్ రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. గ్రాఫిక్ డిజైనర్ లేదా యానిమేటర్‌గా కెరీర్‌ను నిర్మించుకోవచ్చు.

కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్‌ డేటా ఎంట్రీ

ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమవుతోంది. ఈ కోర్సుల ద్వారా ఎంఎస్ ఆఫీస్, డేటా మేనేజ్‌మెంట్, డేటాబేస్‌లపై అవగాహన పెరుగుతుంది. తక్కువ కాలంలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.

అగ్రికల్చర్‌ సంబంధిత కోర్సులు

వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఆర్గానిక్ ఫార్మింగ్, అగ్రి బిజినెస్ అంశాలపై శిక్షణ అందించే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ రంగంలో స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

కోర్సు ఎంపిక చేసుకునే ముందు విద్యార్ధులు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి

కోర్సు ఎంపిక చేసే ముందు విద్యార్థులు తమ ఆసక్తులు, నైపుణ్యాలు, భవిష్యత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఉద్యోగ అవకాశాలు, వేతన స్థాయిలు, డిమాండ్ వంటి అంశాలను అధ్యయనం చేయడం అవసరం. అలాగే భవిష్యత్తులో ఉన్నత విద్యకు అవకాశం కల్పించే కోర్సులను ఎంచుకోవడం మంచిది. తద్వారా సరైన కోర్సు ఎంపికతో విద్యార్థులు తమ కెరీర్‌ను విజయవంతంగా తీర్చిదిద్దుకోవచ్చు. నైపుణ్యాభివృద్ధి, ప్రాక్టికల్ శిక్షణ, సరైన మార్గదర్శకత్వం ద్వారా మంచి ఉద్యోగం, అధిక వేతనంతో మీ కలల భవిష్యత్తును సాధించవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us