
BHEL Artisan Recruitment 2027: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా తొమ్మిది తయారీ యూనిట్లలో మొత్తం 660 ఆర్టిసన్ గ్రేడ్-4 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియను ప్రకటించింది. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ సహా ఏడు ట్రేడ్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం.
బీహెచ్ఈఎల్ ఆర్టిసన్ రిక్రూట్మెంట్కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ 2026 అక్టోబర్ 21 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 2026 అక్టోబర్ 21, ఉదయం 10 గంటల నుంచి
దరఖాస్తులకు చివరి తేదీ: 2026 నవంబర్ 18, రాత్రి 11:45 గంటల వరకు
వయస్సు, విద్యార్హతల కటాఫ్ తేదీ: 2026 అక్టోబర్ 1
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): 2026 డిసెంబర్ 11 (తాత్కాలికంగా)
ట్రేడ్ల వారీగా ఖాళీల వివరాలు
బీహెచ్ఈఎల్ ప్రకటించిన 660 పోస్టులను ఏడు ట్రేడ్లలో భర్తీ చేయనున్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (NTC/ITI), నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ (NAC) కలిగి ఉండాలి. అయితే ట్రేడ్‌ను బట్టి నిర్దేశించిన అర్హతలు, కనీస మార్కులు, ఇతర నిబంధనలు మారవచ్చు. అందువల్ల అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించాలి.
అభ్యర్థుల ఎంపికలో ప్రధానంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. అనంతరం అర్హత సాధించిన వారికి ధ్రువపత్రాల పరిశీలన, నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అర్హత పరీక్షగా స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష విధానం, దరఖాస్తు ఫీజు, అర్హత ప్రమాణాలు తదితర వివరాలను అధికారిక ప్రకటనలో తెలుసుకోవాలి.
అర్హత కలిగిన అభ్యర్థులు బీహెచ్ఈఎల్ అధికారిక కెరీర్స్ వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఒక తయారీ యూనిట్‌కు, ఒక ట్రేడ్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తమకు అనుకూలమైన యూనిట్, ట్రేడ్‌ను ఎంపిక చేసుకునే ముందు ఖాళీలు, పోస్టింగ్ వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు పూర్తి చేసుకోవడం మంచిది.
భెల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి