
బీఈ లేదా బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ ప్రభుత్వ సంస్థ Bharat Electronics Limited (BEL) బెంగళూరులోని విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామకాల ద్వారా ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాల్లో బీఈ/బీటెక్ లేదా నాలుగేళ్ల బీఎస్సీ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టుకు కనీసం ఐదేళ్ల అనుభవం, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు రెండేళ్ల పని అనుభవం అవసరం.
ప్రారంభంలో మూడేళ్లపాటు కాంట్రాక్ట్ ఆధారంగా నియామకం ఉంటుంది. అభ్యర్థి పనితీరు సంతృప్తికరంగా ఉంటే మరో రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది.
కాంట్రాక్ట్ పొడిగించిన ప్రతి ఏడాది రూ.5,000 చొప్పున జీతం పెరుగుతుంది. అదనంగా మెడికల్ ఇన్సూరెన్స్, దుస్తుల అలవెన్స్, స్టిచింగ్ ఛార్జీలు, ఫుట్‌వేర్ అలవెన్స్‌ల రూపంలో ప్రత్యేక భత్యాలు కూడా అందిస్తారు.
అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష 85 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని 1:10 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలను BEL అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించడంతో పాటు అభ్యర్థుల ఈమెయిల్‌కు సమాచారం పంపిస్తారు.
అభ్యర్థులు BEL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి Careers విభాగంలో సంబంధిత నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు వేర్వేరు అప్లికేషన్ లింకులు ఉంటాయి. అవసరమైన వివరాలు నమోదు చేసి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లిస్తే దరఖాస్తు పూర్తవుతుంది.