Bank of Baroda Jobs 2025: డిగ్రీ అర్హతతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?

Bank of Baroda Apprentices Recruitment 2025: దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలన్నింటి బ్రాంచుల్లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 2,700 అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు..

Bank of Baroda Jobs 2025: డిగ్రీ అర్హతతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?
Bank Of Baroda Apprentices Jobs

Updated on: Nov 11, 2025 | 2:32 PM

బ్యాంక్ ఆఫ్‌ బరోడా.. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలన్నింటి బ్రాంచుల్లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 2,700 అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 11వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

రాష్ట్రాల వారీగా పోస్టుల వివరాలు ఇలా..

  • తెలంగాణలో పోస్టుల సంఖ్య: 154
  • ఆంధ్రప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 38
  • తమిళనాడులో పోస్టుల సంఖ్య: 159
  • కర్ణాటకలో పోస్టుల సంఖ్య: 440
  • కేరళలో పోస్టుల సంఖ్య: 52
  • ఒడిశాలో పోస్టుల సంఖ్య: 29
  • పాండిచ్చెరిలో పోస్టుల సంఖ్య: 06
  • ఛత్తీస్‌గఢ్‌లో పోస్టుల సంఖ్య: 48
  • గోవాలో పోస్టుల సంఖ్య: 10
  • మహారాష్ట్రలో పోస్టుల సంఖ్య: 297
  • మధ్యప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 56
  • పశ్చిమ్ బెంగాల్‌లో పోస్టుల సంఖ్య: 104
  • బిహార్‌లో పోస్టుల సంఖ్య: 47
  • ఉత్తర్‌ ప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 307
  • ఉత్తారఖండ్‌లో పోస్టుల సంఖ్య: 22
  • రాజస్థాన్‌లో పోస్టుల సంఖ్య: 215
  • ఝార్ఖండ్‌లో పోస్టుల సంఖ్య: 15
  • పంజాబ్‌లో పోస్టుల సంఖ్య: 96
  • మిజోరంలో పోస్టుల సంఖ్య: 05
  • మణిపుర్‌లో పోస్టుల సంఖ్య: 02
  • చంఢీఘర్‌లో పోస్టుల సంఖ్య: 12
  • గుజరాత్లో పోస్టుల సంఖ్య: 400
  • దాద్రానగర్‌ హవేలిలో పోస్టుల సంఖ్య: 05
  • ఢిల్లీలో పోస్టుల సంఖ్య: 119
  • జమ్మూ కశ్మీర్‌లో పోస్టుల సంఖ్య: 05
  • హరియాణాలో పోస్టుల సంఖ్య: 36
  • అస్సాంలో పోస్టుల సంఖ్య: 21

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 3 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్ 1, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.800, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.400 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 స్టైంపెండ్ చెల్లిస్తారు.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us