APSFC Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతంతో..

|

Mar 09, 2022 | 6:26 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలోని విజయవాడకు చెందిన ఆంధ్రప్రదే స్టేట్ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (APSFC) ఒప్పంద ప్రాతిపదికన సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

APSFC Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతంతో..
Ap Jobs
Follow us on

APSFC software developer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలోని విజయవాడకు చెందిన ఆంధ్రప్రదే స్టేట్ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (APSFC) ఒప్పంద ప్రాతిపదికన సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 2

ఖాళీల వివరాలు: సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.85,000ల నుంచి రూ.1,20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఇంజనీరింగ్‌ లేదా కంప్యూటర్‌ అప్లికేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 2 నుంచి 5 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏఫ్రిల్‌ 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Attention! ఏపీ ఇంటర్‌ 2022 ప్రాక్టికల్స్‌ హాల్‌ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..