
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ (APPSC) గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్‌సీ విడుదల చేసింది. తాజాగా నోటిఫికేషన్‌తో మొత్తం పోస్టుల సంఖ్య 686 నుంచి 720కి పెరిగింది. ఇందులో 471 ఎగ్జిక్యూటివ్, 249 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.
ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులంటే?
గ్రూప్-2 నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 203 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు, 176 డిప్యూటీ ఎంపీడీవో పోస్టులు ఉన్నాయి. అలాగే 40 జీఎస్టీ ఆఫీసర్ పోస్టులు, 29 ఎక్సైజ్ ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నేటి నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు
ఇక గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమైనట్టు అధికారులు పేర్కొన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 11 చివరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు.
మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.