
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 సర్వీసుల కింద వివిధ కేటగిరీల పోస్టుల భర్తీకి 163 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అక్టోబర్ 6, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాల్లో సివిల్ సర్వీసెస్‌లో డిప్యూటీ కలెక్టర్, పోలీస్ సర్వీసెస్‌లో డీఎస్‌పీ, ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌లో డీఈఓ, ట్రైబల్ వెల్ఫేర్, స్టేట్ ఆడిట్ సర్వీస్ తదితర 13 ఏపీ సర్వీసులకు చెందిన పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అయితే కొన్ని ప్రత్యేక పోస్టులకు నిర్దిష్ట విద్యార్హతలు అవసరం. డీఎస్‌పీ (కమ్యూనికేషన్స్) పోస్టుకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా రేడియో ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు అక్టోబర్ 6, 2026 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు దశల్లో ఎంపిక ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. మొత్తం 825 మార్కులకు ఈ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పోస్టును బట్టి అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం లభించనుంది.
డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్, డీఎస్‌పీ, డీఈఓ పోస్టులకు నెలకు: రూ.61,960 నుంచి రూ.1,51,370 వరకు
ఆర్‌టీఓ, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ తదితర పోస్టులకు నెలకు: రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు
డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుకు నెలకు: రూ.65,360 నుంచి రూ.1,54,980 వరకు
ఇతర పోస్టులకు నెలకు: రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు
స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్‌లైన్‌లో OMR ఆధారిత ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్ 120 మార్కులకు, పేపర్ 2 జనరల్ ఆప్టిట్యూడ్ 120 మార్కులు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు కోత విధిస్తారు.
మెయిన్స్ పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు క్వాలిఫైయింగ్ లాంగ్వేజ్ పేపర్లు, తెలుగు, ఇంగ్లిష్, అలాగే ఐదు జనరల్ కోర్ పేపర్లు ఉంటాయి. ప్రతి జనరల్ కోర్ పేపర్ 150 మార్కులకు ఉంటుంది. మెయిన్స్ అనంతరం నిర్వహించే ఇంటర్వ్యూకు 75 మార్కులు కేటాయించారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.