APPSC గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 అభ్యర్థులకు అలర్ట్.. ప్రిలిమ్స్ తేదీలు ఖరారు! ఏ తేదీన ఏ పరీక్షంటే?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు APPSC కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్షల తేదీలను ప్రకటించింది. 166 గ్రూప్‌-1 పోస్టులకు జనవరి 24న, 720 గ్రూప్‌-2 పోస్టులకు ఫిబ్రవరి 21న పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్‌-2 దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 11 వరకు కొనసాగనుంది. ఈ పరీక్షల తేదీలు, అర్హతలు, దరఖాస్తు వివరాలు తెలుసుకోండి..

APPSC గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 అభ్యర్థులకు అలర్ట్.. ప్రిలిమ్స్ తేదీలు ఖరారు! ఏ తేదీన ఏ పరీక్షంటే?
APPSC Group 1 and 2 Exam Dates

Updated on: Nov 15, 2026 | 9:45 AM

అమరావతి, నవంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఇటీవల విడుదల చేసిన గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష తేదీలను ప్రకటించింది. మొత్తం 886 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్లు విడుదల కాగా.. ఇప్పటికే గ్రూప్‌-1 దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. గ్రూప్‌-2 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

జనవరి 24న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్

APPSC విడుదల చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 166 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జనవరి 24, 2027న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గ్రూప్‌-1 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబరు 9తో ముగిసింది. అయితే దరఖాస్తుల్లో తప్పులు చేసిన అభ్యర్థులకు వాటిని సరిచేసుకునేందుకు కమిషన్ అవకాశం కల్పించింది.

ఫిబ్రవరి 21న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 స్క్రీనింగ్ టెస్ట్

మరోవైపు గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి APPSC మొత్తం 720 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్‌ను ఫిబ్రవరి 21, 2027న నిర్వహించనున్నారు. గ్రూప్‌-2 దరఖాస్తుల ప్రక్రియ నవంబరు 10న ప్రారంభమైంది. డిసెంబరు 11, 2026వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఇతర నిబంధనలను పరిశీలించాలి. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలకు మధ్య తక్కువ వ్యవధి ఉండటంతో అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదవడం అవసరం. ముఖ్యంగా గత ప్రశ్నపత్రాలను సాధన చేయడం, రోజువారీ కరెంట్ అఫైర్స్ చదవడం, సిలబస్ ప్రకారం ముఖ్యమైన అంశాలను పునశ్చరణ చేయడం ద్వారా పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిసెంబరు 11 చివరి తేదీని గుర్తుంచుకోవాలి. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు, ఇతర తాజా సమాచారాన్ని APPSC అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు పరిశీలించాలి.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us