AP Open Inter Exams 2026: ఏపీ ఓపెన్ ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. పూర్తి టైం టేబుల్‌ ఇదే

రాష్ట్రంలోని ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీ ఓఎస్ఎస్) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ పరీక్షలు మార్చి 2వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల..

AP Open Inter Exams 2026: ఏపీ ఓపెన్ ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. పూర్తి టైం టేబుల్‌ ఇదే
APOSS Intermediate March 2026 Exams

Updated on: Feb 16, 2026 | 6:31 PM

అమరావతి, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీ ఓఎస్ఎస్) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ పరీక్షలు మార్చి 2వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 2 నుంచి 13వ తేదీ వరకు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఏపీ ఓఎస్ఎస్ ఆదేశించింది.

అలాగే పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ అమలు చేయాలని, పోలీసు బందోబస్తు ఏర్పాటుతోపాటు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిఘా వంటి పలు చర్యల విషయంలో పోలీసు శాఖతో సమస్వయం అవసరమని అన్నారు. ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా పరీక్షలకు పకడ్భందీగా నిర్వహించనున్నట్లు పేర్కొంది. పరీక్ష కేంద్రాల వద్ద నో సెల్ ఫోన్ జోన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయనున్నట్లు తెలిపింది. అలాగే విద్యార్ధులకు అవసరమైన తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.

ఏపీ ఓపెన్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ 2026 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఏపీ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు తుది ఎంపిక జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌ ఉద్యోగాలు) పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితాను తాజాగా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆంగ్లం, సంస్కృతం, గణితం, జంతుశాస్త్రం, చరిత్ర సబ్జెక్టుల్లో మొత్తం 17 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కమిషన్‌ పేర్కొంది. ఈ మేరకు ఎంపిక జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 47 పోస్టులకు గానూ 2023 డిసెంబరు 28న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. విద్యార్హతలు, కంప్యూటర్‌ నైపుణ్య పరీక్షలో అనుత్తీర్ణులు కావడం, ఉర్దూ పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో వంటి పలు కారణాలతో 6 సబ్జెక్టుల ఫలితాలను పెండింగ్‌లో పెట్టింది. పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 10 సబ్జెక్టులకు సంబంధించి 25 మంది అభ్యర్థుల ఎంపిక జాబితాను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us