
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL).. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నింటికీ ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ విభాగాల్లో ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 20, 2026వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి జులై 1, 2026 నాటికి 18 నుంచి 42 ఏళ్లు మధ్య ఉండాలి. నిబంధనల మేరకు ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు 47 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 52 ఏళ్ల వరకు వయసు ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జులై 20, 2026వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కింద అభ్యర్ధులు రూ.1000 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ప్రొబేషన్ కాలంలో నెలకు రూ.75,000 స్టైపెండ్ అందిస్తారు. ప్రొబేషన్ తరువాత నెలకు రూ.86,245 నుంచి రూ.2,08,915 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఆన్‌లైన్ రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. కోర్ సబ్జెక్టులకు 70 మార్కులు, జనరల్ ఇంటలీజెన్స్ అండ్ రిజనింగ్‌కు 5 మార్కులు, జనరల్ అవేర్‌నెస్‌కు 7, ఇంగ్లిష్ లాంగ్వేజెస్‌కు 5, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు 8, కంప్యూటర్ నాలెడ్జ్‌కు 5 మార్కుల చొప్పున కేటాయిస్తారు. నెగెటివ్ మార్కులు ఉండవు.