AP TET 2026 ఫలితాలు విడుదల.. ఇన్‌ సర్వీస్‌ టీచర్లలో 50.93% ఉత్తీర్ణత

ఏపీ టెట్‌ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేశ్‌ ఫలితాలను విడుదల చేయగా.. మొత్తం 45.63 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల్లో 50.93 శాతం మంది అర్హత సాధించారు. పరీక్షకు హాజరైన 1,97,703 మంది అభ్యర్థుల్లో 90,862 మంది ఉత్తీర్ణులయ్యారు. అభ్యర్థులు ఈ కింది అధికారిక వెబ్‌సైట్లు, వాట్సాప్‌ నంబర్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు..

AP TET 2026 ఫలితాలు విడుదల.. ఇన్‌ సర్వీస్‌ టీచర్లలో 50.93% ఉత్తీర్ణత
AP TET Results Released

Updated on: Sep 14, 2026 | 6:18 AM

అమరావతి, సెప్టెంబర్ 14: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (AP TET 2026) ఫలితాలు ఆదివారం (సెప్టెంబర్ 13) రాత్రి విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ టెట్‌ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. అర్హత సాధించలేకపోయిన వారు నిరుత్సాహపడకుండా మరోసారి ప్రయత్నించాలని సూచించారు. ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి 16 వరకు 12 రోజుల పాటు ఏపీ టెట్‌ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,97,703 మంది అభ్యర్థులు 2,18,254 పేపర్లకు హాజరయ్యారు. వీరిలో 90,862 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 45.63 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు టెట్‌ కన్వీనర్‌ ఎం. వెంకటకృష్ణారెడ్డి తెలిపారు.

గత టెట్‌తో పోలిస్తే..

టెట్‌ పరీక్షకు 74,711 మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 72,288 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 37,789 మంది 41,315 పేపర్లలో ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఇన్‌ సర్వీస్‌ టీచర్లలో 50.93 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షల అనంతరం విడుదల చేసిన ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను అధికారులు పరిశీలించారు. అనంతరం తుది కీ ఆధారంగా ఫలితాలను విడుదల చేసినట్లు టెట్‌ కన్వీనర్‌ తెలిపారు. అక్టోబర్‌ 2025లో నిర్వహించిన టెట్‌ పరీక్షలకు 31,886 మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు హాజరయ్యారు. వీరిలో 15,239 మంది, అంటే 47.82 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. తాజా టెట్‌లో ఇన్‌ సర్వీస్‌ టీచర్ల ఉత్తీర్ణత శాతం పెరిగింది. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్లు, నిబంధనలను అధికారిక వెబ్‌సైట్లలో పరిశీలించాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు తమ క్యాండిడేట్‌ లాగిన్‌ ద్వారా టెట్‌ ఫలితాలను ఈ కింది అధికారిక వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. అలాగే వాట్సాప్‌ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us