ప్రతి శనివారం బ్యాగ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.. ఏపీలో కొత్త నిబంధన

రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానుండగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు, 87 సెలవు దినాలు ఉండనున్నట్లు విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్‌లో వెల్లడించింది..

ప్రతి శనివారం బ్యాగ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.. ఏపీలో కొత్త నిబంధన
AP School Reopening Today

Updated on: Jun 11, 2026 | 9:20 PM

అమరావతి, జూన్‌ 11: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం (జూన్ 12) నుండి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీంతో రేపటి నుంచి 2026-27 విద్యా సంవత్సరం మొదలవనుంది. ఈ ఏడాది మొత్తం 229 పనిదినాలు, 87 సెలవు దినాలు ఉన్నట్లు ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్‌ క్యాలెండర్‌లో పేర్కొంది. 5 ఐచ్ఛిక సెలవులు, 3 స్థానిక సెలవులు రానున్నాయి. అలాగే ఏపీలో మార్చి 15 నుండి 31 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. అన్ని స్కూళ్లలో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’గా అమలు చేయనున్నారు. ఇక స్కూళ్లలో ప్రతి ఉపాధ్యాయుడు వారానికి కనీసం 24 పీరియడ్‌లు, గరిష్టంగా 30 పీరియడ్‌లు బోధించాలి.

2026-27 విద్యా సంవత్సరానికి ఏపీ పాఠశాలల సెలువులు ఇవే..

  • ఏపీలో దసరా సెలవులు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు (మైనారిటీ పాఠశాలల్లో అక్టోబర్ 15 నుంచి 21 వరకు)
  • క్రిస్మస్ సెలవులు 2026 డిసెంబర్ 25న ఉంటుంది. (మైనారిటీ పాఠశాలల్లో డిసెంబర్ 20 నుంచి 27 వరకు)
  • సంక్రాంతి సెలవులు 2027 జనవరి 11 నుండి 17 వరకు (మైనారిటీ పాఠశాలల్లో జనవరి 13 నుంచి 17 వరకు)

అలాగే ఈ ఏడాది విద్యార్ధులకు 12 దినోత్సవాలకు అదనంగా 10 దినోత్సవాలను చేర్చారు. కొత్తగా చేర్చిన వాటిల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్‌ 21, యాంటీ డ్రగ్‌ డే- జూన్‌ 26, ప్రపంచ జనాభా దినోత్సవం జులై 11, జాతీయ అంతరిక్ష దినోత్సవం ఆగస్టు 23, జాతీయ విద్యా దినోత్సవం నవంబరు 11, రాజ్యాంగ దినోత్సవం నవంబరు 26, జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం జనవరి 3 (సావిత్రిబాయి ఫులె జయంతి), జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25, ఆంగ్ల భాషా దినోత్సవం- ఫిబ్రవరి 13 (సరోజిని నాయుడు జయంతి), ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ఏప్రిల్‌ 22లను కూడా ఈ ఏడాది నుంచి జరుపుకోనున్నారు. ఈ దినోత్సవాలు జరుపుకునే రోజుల్లో సెలవులు వస్తాయో.. రావో.. ప్రభుత్వం సెలవుల జాబితా చూస్తేగానీ తెలియదు.

Loading...
Unable to load recommendations.
Follow Us