AP CET's Counseling Schedule 2025: లాసెట్, పీజీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ 2025లకు సంబంధించిన ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఒక్కో సెట్‌కు రెండు విడతలుగా కౌన్సెలింగ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తొలుత ఏపీ లాసెట్, పీజీ లాసెట్ 2025 ప్రవేశాలు..
అమరావతి, సెప్టెంబర్ 8: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన లాసెట్, పీజీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ 2025లకు సంబంధించిన ఫలితాలు విడుదలైనప్పటికీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభంకాలేదు. తాజాగా ఉన్నత విద్యామండలి అన్ని సెట్ల ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌లను విడుదల చేసింది. ఒక్కో సెట్‌కు రెండు విడతలుగా కౌన్సెలింగ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తొలుత ఏపీ లాసెట్, పీజీ లాసెట్ 2025 ప్రవేశాల కౌన్సెలింగ్ సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి టీవీ శ్రీకృష్ణమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు.