AP Inter 2026 Hall Tickets: మరో వారంలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు త్వరలోనే విడుదలకానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు (BIEAP) ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర 2026 వార్షిక పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న..
అమరావతి, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు త్వరలోనే విడుదలకానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు (BIEAP) ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర 2026 వార్షిక పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే విద్యార్ధుల తల్లిదండ్రుల ఫోన్ నుంచి కూడా నేరుగా పొందవచ్చు. ఇప్పటికే ఇంటర్ బోర్డు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి చేసింది.
ఇక ఫిబ్రవరి 23, 2026వ తేదీ నుంచి జరగనున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (సింగిల్ షిఫ్ట్) పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డ్ తెలిపింది.