ఇంటర్‌ విద్యార్థులకు ఊరట.. అందరికీ పబ్లిక్‌ పరీక్షలు రాసే ఛాన్స్‌: ఇంటర్‌బోర్డు స్పష్టీకరణ

రాష్ట్రంలోని అర్హులైన ఇంటర్మీడియట్‌ విద్యార్థులందరికీ వార్షిక పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తామని ఇంటర్‌బోర్డు స్పష్టం చేసింది. కళాశాలల అనుబంధ గుర్తింపుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిబంధనలు పాటించిన కళాశాలలకే గుర్తింపు ఇచ్చామని బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్‌ ఓ ప్రకటనలో తెలిపారు..

ఇంటర్‌ విద్యార్థులకు ఊరట.. అందరికీ పబ్లిక్‌ పరీక్షలు రాసే ఛాన్స్‌: ఇంటర్‌బోర్డు స్పష్టీకరణ
Inter Board Assures Annual Exam Opportunity For All Students

Updated on: Oct 18, 2026 | 2:55 PM

హైదరాబాద్‌, అక్టోబర్ 18: రాష్ట్రంలోని అర్హులైన ఇంటర్మీడియట్‌ విద్యార్థులందరికీ వార్షిక పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తామని ఇంటర్‌బోర్డు స్పష్టం చేసింది. కళాశాలల అనుబంధ గుర్తింపు విషయంలో తలెత్తిన సమస్యల కారణంగా విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్‌ ప్రకటన వెలువరించారు. అన్ని నిబంధనలను పాటించిన కళాశాలలకే అనుబంధ గుర్తింపు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు.

నిబంధనల్లో లోపాలున్న కళాశాలలకు వాటిని సరిదిద్దుకునేందుకు నిర్దేశిత గడువు ఇచ్చినట్లు తెలిపారు. అనుబంధ గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని విద్యార్థులు, తల్లిదండ్రులను పలుమార్లు అప్రమత్తం చేసినట్లు గుర్తుచేశారు. అయితే రాష్ట్రంలో అర్హులైన విద్యార్థులందరికీ వార్షిక పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తామని బోర్డు స్పష్టం చేయడంతో విద్యార్థులకు ఊరట లభించనుంది. కళాశాలల గుర్తింపు, నిబంధనల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us