
హైదరాబాద్, అక్టోబర్ 15: న్యాయవాద వృత్తిలో కొనసాగాలనుకునే అభ్యర్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE) 22 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే అందులోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా అభ్యర్థి పేరు, రోల్ నంబర్, పరీక్షా కేంద్రం చిరునామా, కేటగిరీ, పరీక్ష సమయం, ఫొటో, సంతకం వంటి వివరాలను సరిచూసుకోవాలి. ఏవైనా తప్పులు లేదా పొరపాట్లు కనిపిస్తే పరీక్ష తేదీకి ముందుగానే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులను సంప్రదించి సరిచేయించుకోవాలి. AIBE 22 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డు ప్రింటెడ్ కాపీని తప్పనిసరిగా తమ వెంట తీసుకెళ్లాలి. హాల్‌టికెట్ లేకుండా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అందువల్ల చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. పరీక్షకు సంబంధించిన తాజా మార్గదర్శకాలు, నిబంధనలు, పరీక్షా కేంద్ర వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 2026 హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.