BTechలో బ్యాక్‌లాగ్స్.. JEE, UPSC, RPSCలోనూ ఫెయిల్.. ఇప్పుడు రూ.60 లక్షల జీతంతో జాబ్! ఈ కుర్రాడి కథ వినండి

JEEలో రెండుసార్లు విఫలం.. B.Techలో 6.4 CGPA.. పలు బ్యాక్‌లాగ్స్.. UPSC, RPSC పరీక్షల్లోనూ విజయం దక్కలేదు. అయినప్పటికీ పట్టుదలతో ముందుకు సాగిన శుభమ్ సోనీ ప్రస్తుతం Courseraలో Frontend Engineerగా పనిచేస్తున్నాడు. Infosysలో రూ.3.6 లక్షల వార్షిక ప్యాకేజీతో కెరీర్ ప్రారంభించి.. PubMatic, Amazon మీదుగా ప్రస్తుతం రూ.60 లక్షలకు పైగా వార్షిక వేతనం అందుకుంటున్నాడు..

BTechలో బ్యాక్‌లాగ్స్.. JEE, UPSC, RPSCలోనూ ఫెయిల్.. ఇప్పుడు రూ.60 లక్షల జీతంతో జాబ్! ఈ కుర్రాడి కథ వినండి
Shubham Soni Success Story

Updated on: Sep 17, 2026 | 6:05 AM

జీవితంలో ఎదురైన వైఫల్యాలే చివరి గమ్యం కావని ఓ యువకుడు నిరూపించాడు. ఇంజినీరింగ్‌లో కేవలం 6.4 CGPA.. కాలేజీలో పలు బ్యాక్‌లాగ్స్.. JEEలో రెండుసార్లు విఫలం.. UPSC, RPSC పరీక్షల్లోనూ విజయం దక్కలేదు. అయినప్పటికీ పట్టుదలతో ముందుకు సాగిన శుభమ్ సోనీ ప్రస్తుతం ప్రముఖ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ Courseraలో Frontend Engineerగా పనిచేస్తున్నట్లు ఓ సోషల్ మీడియా పోస్ట్ పేర్కొంది. ఆయన వార్షిక వేతనం రూ.60 లక్షలకు పైగా ఉంటుందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

JEEలో రెండుసార్లు విఫలం

మహారాణా ప్రతాప్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో B.Tech పూర్తి చేసిన శుభమ్ సోనీ కెరీర్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. EE పరీక్షలో మొదటిసారి విజయం సాధించలేకపోవడంతో మరోసారి ప్రయత్నించేందుకు ఏడాది విరామం తీసుకున్నప్పటికీ, రెండో ప్రయత్నంలోనూ ఆయనకు విజయం దక్కలేదని సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

B.Techలో బ్యాక్‌లాగ్స్.. UPSC, RPSCలోనూ ఫెయిల్!

ఇంజినీరింగ్‌లో చేరిన తర్వాత కూడా శుభమ్‌కు చదువులో ఇబ్బందులు కొనసాగాయి. B.Tech పూర్తిచేసే సమయానికి ఆయన 6.4 CGPA మాత్రమే సాధించడంతోపాటు, పలు బ్యాక్‌లాగ్స్ కూడా ఉన్నాయని ఆ పోస్ట్ తెలిపింది. అయితే చదువులో ఎదురైన ఈ సమస్యలు ఆయన లక్ష్యాలను ఆపలేకపోయాయి. B.Tech రెండో సంవత్సరం పూర్తయిన తర్వాత శుభమ్ సోనీ UPSC సివిల్స్ పరీక్షకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నారని ఆ పోస్ట్ పేర్కొంది. UPSCకి ప్రిపేర్ అయి పరీక్ష రాసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఆ తర్వాత Rajasthan Public Service Commission (RPSC) పరీక్షను ప్రయత్నించారు. అక్కడ కూడా ఆశించిన ఫలితం రాకపోవడంతో చివరకు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల ప్రయత్నాలను పక్కన పెట్టి కార్పొరేట్ రంగంలోకి అడుగుపెట్టారు.

ఒక సంవత్సరం తర్వాత శుభమ్ సోనీ Infosysలో System Engineerగా ఉద్యోగంలో చేరారు. అక్కడ ఆయన వార్షిక వేతనం రూ.3.6 లక్షలుగా ఉన్నట్లు పోస్ట్ పేర్కొంది. అక్కడ రెండేళ్లు పనిచేసిన అనంతరం PubMaticలో చేరారు. ఆ తర్వాత Amazonలో ఉద్యోగం సాధించి, అక్కడ సుమారు రూ.50 లక్షల వార్షిక ప్యాకేజీ అందుకున్నట్లు సోషల్ మీడియా పోస్ట్ పేర్కొంది. ప్రస్తుతం Courseraలో Frontend Engineerగా పనిచేస్తున్నారని, ఆయన వార్షిక ఆదాయం రూ.60 లక్షలకు పైగా ఉంటుందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

‘వైఫల్యాలతో ఆగిపోవద్దు’

శుభమ్ సోనీ కెరీర్ ప్రయాణాన్ని ఉద్దేశిస్తూ Xలో @VikasAlwys చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుస వైఫల్యాలు ఎదురైనా ప్రయత్నాన్ని కొనసాగిస్తే కెరీర్‌లో మార్పు సాధ్యమవుతుందనే చర్చకు ఈ కథనం కారణమైంది. ‘ఇక్కడ అసలు గొప్ప విషయం జీతం కాదని, ఎన్నో వైఫల్యాలు ఎదురైనా ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు సాగడమే’, ‘తక్కువ CGPA అనేది జీవితాంతం మోసుకెళ్లాల్సిన ముద్ర కాదు. స్థిరమైన కృషి చాలా విషయాలను మార్చగలదు’ అంటూ నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఒక పరీక్షలో వైఫల్యం ఎదురైనా, తక్కువ మార్కులు వచ్చినా.. అది కెరీర్‌కు అంతిమ నిర్ణయం కావాల్సిన అవసరం లేదు. నేర్చుకుంటూ, నైపుణ్యాలను పెంచుకుంటూ నిరంతరం ప్రయత్నించడం ద్వారా కెరీర్ దిశను మార్చుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us