Money Tips: కోటీశ్వరులు కావాలంటే.. డబ్బు ఎక్కడ పెట్టుబడిపెట్టాలో తెలుసా..?

Want to Become a Crorepati?: కోటీశ్వరులు కావడం కేవలం అదృష్టంపై ఆధారపడదు. సరైన పెట్టుబడులు, క్రమశిక్షణతో కూడిన పొదుపు అలవాట్లు, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలే సాధారణ వ్యక్తిని సంపన్నుడిగా మార్చగలవు. సంపన్నులు కావాలంటే దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టాలి. అదే సమయంలో అత్యాశతో కాకుండా సరైన అవగాహనతో పెట్టుబడి పెట్టాలి.

Money Tips: కోటీశ్వరులు కావాలంటే.. డబ్బు ఎక్కడ పెట్టుబడిపెట్టాలో తెలుసా..?
Where To Invest To Become A Crorepati
Image Credit source: AI

Updated on: May 08, 2026 | 4:57 PM

జీవితంలో కోటీశ్వరులుగా ఎదగాలని చాలా మంది కలలు కంటారు. అయితే ఎవరూ కేవలం అదృష్టంతో కోటీశ్వరులు కాలేదు. సంపన్నులు కావాలంటే డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు.. సంపాదించిన డబ్బును సరైన చోట పెట్టుబడి పెట్టడం కూడా ఎంతో ముఖ్యం. నిజానికి పెద్ద మొత్తంలో డబ్బు ఒక్కసారిగా రావడం వల్ల కాకుండా, సరైన పెట్టుబడులు, క్రమశిక్షణతో కూడిన పొదుపు మార్గాల వల్లే చాలా మంది సంపన్నులుగా మారుతున్నారు. కోటీశ్వరులు కావాలంటే అత్యాశతో కాకుండా సరైన అవగాహనతో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం.

కోటీశ్వరులు కావాలంటే ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు చూద్దాం.. 

  1. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు: సంపన్నులు కావాలంటే దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టాలి. స్టాక్ మార్కెట్‌లో మంచి కంపెనీల షేర్లలో దీర్ఘకాలం పెట్టుబడి పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మార్కెట్‌పై కనీస అవగాహన లేకుండా.. కేవలం లాభాపేక్షతో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం. అందుకే మ్యూచువల్ ఫండ్స్ SIPలు చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. ప్రతి నెలా కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే, కాలక్రమేణా పెద్ద మొత్తంగా మారుతుంది.
  2. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి: రియల్ ఎస్టేట్ కూడా సంపద సృష్టించే ప్రధాన మార్గాల్లో ఒకటి. భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి.. అక్కడ స్థలాలు లేదా ఇళ్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో వాటి విలువ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంలో సరైన అవగాహన కూడా అవసరం.
  3. బంగారంలో పెట్టుబడి: సంపన్నులు కావాలంటే బంగారం వంటి సురక్షిత పెట్టుబడులను పూర్తిగా విస్మరించకూడదు. ముఖ్యంగా డిజిటల్ గోల్డ్, గోల్డ్ ETFలు వంటి మార్గాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆర్థిక భద్రతకు కొంతవరకు సహాయపడతాయి. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. భవిష్యత్తులో ఆర్థిక అవసరాలకు బంగారంపై పెట్టుబడి ఎంతో అవసరం.
  4. మీపై మీరు పెట్టుబడి: పైన పేర్కొన్న వాటితో పాటు మీపై మీరు పెట్టుబడి పెట్టడం కూడా చాలా ముఖ్యం. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, మంచి విద్య పొందడం, టెక్నాలజీపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఆదాయం పెరిగే అవకాశాలు మెరుగవుతాయి.

అయితే ఎక్కువ రాబడిని ఇచ్చే ఏ పెట్టుబడైనా రిస్క్‌ కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి త్వరగా కోటీశ్వరులు అవుదామనే ఆశతో మోసపూరిత స్కీమ్స్‌లో పెట్టుబడులకు దూరంగా ఉండాలి. సరైన ప్రణాళిక, సహనం, క్రమశిక్షణ ఉంటే చిన్న పెట్టుబడులే భవిష్యత్తులో పెద్ద సంపదగా మారే అవకాశం ఉంది.

Follow Us