తొలి దేశీయ సోషల్ మీడియా యాప్‌

|

Jul 05, 2020 | 7:33 PM

చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ దేశానికి చెంది యాప్‌లపై భారత్ నిషేధం విధించింది. దీంతో దేశీయ యాప్ లకు మంచి అదరణ లభిస్తోంది. ఐటీ నిపుణులు మరో స్వదేశీ సోషల్ మీడియా యాప్ ను రూపొందించారు. తొలి దేశీయ సోషల్ మీడియా యాప్‌ ఎలిమెంట్స్‌ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు

తొలి దేశీయ సోషల్ మీడియా యాప్‌
Follow us on

చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ దేశానికి చెంది యాప్‌లపై భారత్ నిషేధం విధించింది. దీంతో దేశీయ యాప్ లకు మంచి అదరణ లభిస్తోంది. ఐటీ నిపుణులు మరో స్వదేశీ సోషల్ మీడియా యాప్ ను రూపొందించారు. తొలి దేశీయ సోషల్ మీడియా యాప్‌ ఎలిమెంట్స్‌ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ట్‌ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. దాదాపు వెయ్యి మంది ఐటీ నిపుణులు, ఆర్ట్‌ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు కలిసి ఈ యాప్‌ను రూపొందించారు.

ఇప్పటికే ఈ యాప్‌ను ఇప్పటికే సుమారు లక్షమంది వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఎలిమెంట్స్‌ సంస్థ తెలిపింది. ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు ఉచితంగా ఆడియో వీడియో కాల్స్, వ్యక్తిగత గ్రూప్‌ చాట్స్‌ చేసుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఆడియో, వీడియో కాన్ఫరెన్స్‌ కాల్స్‌తో పాటు నగదు చెల్లింపులకు సంబంధించి లావాదేవీలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఎలిమెంట్స్‌ పే పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారా ఎక్కువగా భారతీయ ఉత్పత్తులకు ప్రమోషన్స్ కు ఉపయోగిస్తామని అలాగే దేశీయ భాషల్లో వాయిస్‌ కమాండ్స్‌ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ పేర్కొంది.

ఐటీ రంగంలో భారతీయులు అగ్రగామిగా ఉన్నారన్న ఉప రాష్ట్రపతి.. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు వస్తాయని ఆశిస్తున్నాన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పట్టణాలు, గ్రామాల మధ్య సమన్వయం పెరుగుతుందన్నారు. ఎనిమిది దేశీయ భాషల్లో అందుబాటులో ఉన్న ఎలిమెంట్స్‌ యాప్ విదేశీ యాప్‌లతో పోటీపడి నిలవాలని వెంకయ్యనాయుడు అశాభావం వ్యక్తం చేశారు.