UPI Charges: యూపీఐ ద్వారా రూ.10 వేలు చెల్లిస్తే ఎంత ఛార్జీ పడుతుంది..? అక్టోబర్ నుంచి బాదుడే.. ఏ ట్రాన్సాక్షన్లపై ఎంతంటే..?

కేంద్ర ప్రభుత్వం యూపీఐ ఛార్జీలపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 15 నుంచి ఎండీఆర్ ఛార్జీలను అమల్లోకి తీసుకురానుంది. రూ.2 వేలుపైబడి చేసే ట్రాన్సాక్షన్లకు యూపీఐ ఛార్జీలు పడతాయి. ఏదైనా వ్యాపారి వద్ద రూ.2 వేలకుమించి పేమెంట్ చేస్తే ఛార్జీలు పడతాయి.

UPI Charges: యూపీఐ ద్వారా రూ.10 వేలు చెల్లిస్తే ఎంత ఛార్జీ పడుతుంది..? అక్టోబర్ నుంచి బాదుడే.. ఏ ట్రాన్సాక్షన్లపై ఎంతంటే..?
Upi Charges

Updated on: Sep 28, 2026 | 4:25 PM

ఇప్పటివరకు యూపీఐ లావాదేవీలన్నీ ఉచితంగా నిర్వహించుకునే అవకాశం ఉండేది. ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పడేవి కాదు. కానీ అక్టోబర్ నుంచి నిబంధనలు మారుతున్నాయి. యూపీఐ ఛార్జీల బాదుడుకు రంగం సిద్దమవుతోంది. అక్టోబర్ 15 నుంచి పర్సన్ టు మర్చంట్(P2M) మధ్య జరిగే యూపీఐ పేమెంట్లపై ఛార్జీల విధింపునకు అంతా సిద్దమైంది. వ్యాపారుల వద్ద రూ.2 వేలకు మించి చేసే ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధించనున్నారు. వినియోగదారుడు రూ.2 వేలుపైబడి పేమెంట్ చేస్తే వ్యాపారి చార్జీలను భరించాల్సి ఉంటుంది. దీని వల్ల సాధారణ వినియోగదారుడికి ఎలా నష్టం ఉండదు కానీ వ్యాపారులకు మాత్రం ఛార్జీల భారం తప్పదు. ఈ చార్జీలను కస్టమర్‌పై మోపడానికి వీల్లేదు. వ్యాపారి బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లకు వ్యాపారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ చార్జీలు కేంద్ర ప్రభుత్వానికి అందవు. యూపీఐ ఫ్లాట్ ఫామ్స్, బ్యాంకులకు వెళతాయి. యూపీఐ వ్యవస్థను మరింత మెరుగుపర్చడానికి ఈ నిధులను ఉపయోగిస్తారు.

రూ.25 వేలు చెల్లిస్తే ఎంత ఛార్జీలు పడతాయి..?

ఉదాహరణకు ఒక కస్టమర్ షాపుకు వెళ్లి ఏదైనా వస్తువు కొనుగోలు చేసేడనుకుందాం. రూ.10 వేలు పేమెంట్ చేస్తే వ్యాపారికి రూ.40 ఛార్జీ పడుతుంది. వస్తువు ధర రూ.25 వేలుగా ఉండగా.. ఆ మొత్తాన్ని యూపీఐ విధానం ద్వారా వ్యాపారికి కస్టమర్ చెల్లించాడనుకుందాం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం లేదా వ్యాపారి మొబైల్ నెంబర్‌ ఆధారంగా పంపాడు. రూ.2 వేలుపైబడిన లావాదేవీలకు ఎండీఆర్ ఛార్జీలు 0.4 శాతంగా కేంద్రం నిర్ణయించింది. దీని ప్రకారం రూ.25 వేలు చెల్లిస్తే 0.4 శాతం రేటు ప్రకారం రూ.100 ఛార్జీలు పడతాయి. అదే రూ.50 వేలు చెల్లిస్తే వ్యాపారికి రూ.200 ఛార్జీలు పడతాయి. రూ.75 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఎంత చేసినా రూ.300 మాత్రమే పడతాయి. గరిష్ట పరిమితి రూ.300గా కేంద్రం నిర్ణయించింది. ఇక రూ.2 వేలు లేదా అంతకంటే తక్కువ చేస్తే వ్యాపారికి ఎటువంటి ఛార్జీలు పడవు.

రైల్వే టికెట్‌ బుక్ చేసుకుంటే ఎండీఆర్ చార్జీలు పడతాయా..?

ఒకవేళ మీరు ట్రైన్ టికెట్ల బుకింగ్‌పై రూ.3 వేలు ఖర్చు చేశారనుకుందాం. ట్రైన్ టికెట్లపై ఫ్లాట్ రూ.5 ఎండీఆర్ ఛార్జీలను కేంద్రం ఫిక్స్ చేసింది. అంటే రూ.3005 పడతాయి. అయితే రూ.5 మర్చంట్ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మీరు రూ.3 వేలు మాత్రమే కట్టాల్సి ఉంటుంది. మీరు రూ.10 వేలు టికెట్ బుకింగ్‌కు ఖర్చు చేసినా ఎండీఆర్ ఛార్జీ రూ.5గానే ఉంటుంది. యూపీఐ ఛార్జీలను కస్టమర్లపై వ్యాపారులు వేయకుండా చూసుకునే బాధ్యత బ్యాంకులకు కేంద్రం అప్పగించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us