ఈ కామర్స్ దిగ్గజాలకు షాక్.. ఈ సారి ఫెస్టివల్ సేల్స్ లేనట్లేనా..!

| Edited By:

Sep 14, 2019 | 9:22 PM

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ దిగ్గజాలకు ఇండియన్ ట్రేడర్ బాడీ షాక్ ఇచ్చింది. త్వరలో రాబోతున్న ఫెస్టివ్ సీజన్ సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు వారు పలు ఆఫర్లతో సిద్దమవుతుండగా.. వారు ఇచ్చే ఫెస్టివ్ సేల్స్‌ను నిషేధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటి) కేంద్ర ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలను పంపింది. భారీ డిస్కౌంట్ల పేరుతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను(ఎఫ్‌డీఐ) అతిక్రమిస్తున్నాయని వారు వ్యాఖ్యానించారు. ఈ మేరకు వాణిజ్య మంత్రికి సీఏఐటి ఓ లేఖ రాసింది. […]

ఈ కామర్స్ దిగ్గజాలకు షాక్.. ఈ సారి ఫెస్టివల్ సేల్స్ లేనట్లేనా..!
Follow us on

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ దిగ్గజాలకు ఇండియన్ ట్రేడర్ బాడీ షాక్ ఇచ్చింది. త్వరలో రాబోతున్న ఫెస్టివ్ సీజన్ సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు వారు పలు ఆఫర్లతో సిద్దమవుతుండగా.. వారు ఇచ్చే ఫెస్టివ్ సేల్స్‌ను నిషేధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటి) కేంద్ర ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలను పంపింది. భారీ డిస్కౌంట్ల పేరుతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను(ఎఫ్‌డీఐ) అతిక్రమిస్తున్నాయని వారు వ్యాఖ్యానించారు. ఈ మేరకు వాణిజ్య మంత్రికి సీఏఐటి ఓ లేఖ రాసింది.

అయితే ప్రతి పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు ఈ కామర్స్ దిగ్గజాలు భారీ డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తుంటాయి. ఇవి ప్రకటించే భారీ ఆఫర్లు సాధారణ ట్రేడర్లను దెబ్బతీస్తుంటాయని సీఏఐటి కోరింది. 10 నుంచి 80శాతం దాకా భారీ తగ్గింపులను అందించడం ద్వారా.. ఈ కంపెనీలు ధరలను స్పష్టంగా ప్రభావితం చేస్తున్నాయని సీఏఐటి తెలిపింది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 29 నుంచి ఆరు రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ పేరిట భారీ డిస్కౌంట్లను ప్రకటించగా.. అమెజాన్ కూడా త్వరలో గ్రేట్ ఇండియా సేల్‌ను ప్రకటించబోతోంది. ఈ నేపథ్యంలో వాటికి షాక్ తగిలింది.