
Gold, Silver Prices Today: దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు వరుసగా ఆరో సెషన్‌లోనూ రేట్లు భారీగా పడిపోతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం ఏకంగా 3800 డాలర్ల మార్కు దిగువకు చేరింది. అంటే గతేడాది సెప్టెంబరులో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఈ స్థాయిలో కొనసాగింది. అక్కడి నుంచి భారీగా పెరిగి ఈ ఏడాది జనవరి చివర్లో ఏకంగా ఔన్సుకు 5600 డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. అంటే గరిష్ఠ స్థాయిల నుంచి పసిడి ధర 30 శాతానికిపైగా పడిపోయింది. సిల్వర్ రేటు చూస్తే మరీ ఎక్కువగా పడిపోయింది. అదే జనవరిలో ఔన్సుకు 121 డాలర్ల స్థాయిలో గరిష్ఠాల్ని తాకగా ఇప్పుడు అది 46 డాలర్లకు చేరింది. ఇది 60 శాతానికిపైగా పతనాన్ని చూయిస్తుంది.
ఇక తాజాగా దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. రోజు రోజుకు వేలల్లో తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో గ్రాము బంగారం కొనాలంటేనే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు సామాన్యుడు సైతం కొనుగోలు చేసే విధంగా ధరలు అమాంతంగా దిగి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,250 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,140 వద్ద కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే దాదాపు 3 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. వెండిపై 5 వేల రూపాయల వరకు తగ్గింది.
విజయవాడలో కూడా ఇదే ధరతో కొనసాగుతున్నాయి. ఇక వెండి విషయానికొస్తే..1,84,900 వద్ద ట్రేడవుతోంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,290 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,250 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,140 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,250 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,140 వద్ద కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే దాదాపు 3 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. వెండిపై 5 వేల రూపాయల వరకు తగ్గింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి