Today Gold Rate: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో రేట్లు ఇలా

|

Jul 18, 2024 | 8:20 AM

గోల్డ్, సిల్వర్ వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడా రేట్లు పెరుగుతుంటాయి. తగ్గితే తగ్గుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారట్లుగా చెబుతారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం...

Today Gold Rate: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో రేట్లు ఇలా
Gold Price
Follow us on

ఏ పంక్షన్ లేదా ఈవెంట్ అన్నా ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా పసిడి.. మన సంస్కృతి, సంప్రదాయాలలో ఇమిడిపోయింది. ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకునేవారికి కూడా గోల్డ్ బెస్ట్ ఆప్షన్. అందుకే బంగారం, వెండి ధరల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. తాజాగా గోల్డ్ కొనాలనుకుంటున్నారా..? అయితే మీకే ఈ అలర్ట్. బంగారం ధరలు పైకి ఎగబాకుతున్నాయి. ఒక్కరోజులోనే ఊహించనంతగా గోల్డ్ రేటు పెరిగింది. అంతకుముందు కొద్దికొద్దిగా.. పెరుగుకుంటూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా రూ. 1000 వరకు పెరిగి సామాన్యులకు చిక్కనంటున్నాయి. ప్రస్తుత సిట్యువేషన్స్ చూస్తుంటే.. ఇప్పట్లో గోల్డ్ రేట్లు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. US ఫెడరల్ రిజర్వ్ మళ్లీ వడ్డీ రేట్లను తగ్గిస్తాయన్న సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలు పైకి ఎగబాకడం మొదలెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా భారీగా పెరగ్గా.. అదే ధోరణి దేశీయ మార్కెట్‌లోనూ కనిపిస్తోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.68,910గాను.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 75,160గా ఉంది. హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 890 పెరిగి ప్రస్తుతం తులం రూ. 68,760గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 75,010గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రేట్లు ఈ విధంగానే ఉన్నాయి. డాలర్‌ మారకపు విలువ కూడా దేశీయంగా బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది.

పైకే చూస్తోన్న వెండి, ప్లాటినం ధరలు:

ఇక గురువారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,610గా ఉంది.  కేజీ వెండి రేటు ఢిల్లీ మార్కెట్లో ప్రస్తుతం రూ. 96 వేల మార్కు వద్ద ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా రూ. 1000 పెరిగి ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,00,600 వద్ద ఉంది. ఇక  హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.26830గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి