ITR: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. గడువు దాటితే గడ్డుకాలమే..

|

Jul 31, 2024 | 2:06 PM

మీ ఐటీఆర్ ను ఆదాయపు శాఖ అధికారులు పరిశీలించిన తర్వాత మీకు రీఫండ్ ఇవ్వాల్సి ఉంటే మీ బ్యాంకు ఖాతాకు జమచేస్తారు. అసెస్ మెంట్ ఇయర్ (ఏవై) 2024-25కి సంబంధించి ఐటీఆర్ అందజేయడానికి జూలై 31వ తేదీ వరకూ మాత్రమే గడువు ఉంది. మరి ఆ సమయానికి ఐటీఆర్ అందించకపోతే ఏమవుతుంది, ఆదాయపు పన్ను శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలుసుకుందాం.

ITR: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. గడువు దాటితే గడ్డుకాలమే..
Itr
Follow us on

ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) సమర్పించడం ప్రతి పన్నుచెల్లింపుదారుడి ప్రధాన బాధ్యత. ఆ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం తదితర వివరాలను ఆదాయపు పన్ను శాఖకు అందజేయడం వల్ల పన్ను విధించే ఆదాయం తెలుస్తుంది. తద్వారా పన్ను చెల్లించడం సులభమవుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికే ఎక్కువ పన్ను చెల్లించి ఉంటే ఆ సొమ్ములు మీకు రీఫండ్ అందజేస్తారు. మీ ఐటీఆర్ ను ఆదాయపు శాఖ అధికారులు పరిశీలించిన తర్వాత మీకు రీఫండ్ ఇవ్వాల్సి ఉంటే మీ బ్యాంకు ఖాతాకు జమచేస్తారు. అసెస్ మెంట్ ఇయర్ (ఏవై) 2024-25కి సంబంధించి ఐటీఆర్ అందజేయడానికి జూలై 31వ తేదీ వరకూ మాత్రమే గడువు ఉంది. మరి ఆ సమయానికి ఐటీఆర్ అందించకపోతే ఏమవుతుంది, ఆదాయపు పన్ను శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలుసుకుందాం.

జూలై 31 వరకూ గడువు..

ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు జూలై 31తో గడువు ముగిస్తుంది. ఆ సమయానికి అందజేయని వారికి మరో అవకాశం ఉంది. అలాంటి వారందరూ 2024 డిసెంబర్ 31వ తేదీలోపు జరిమానాతో అందజేయవచ్చు. అప్పటికి కూడా అందజేయకపోతే మమ్మల్ని కొత్త పన్ను విధానంలోకి ఆటోమేటిక్ గా మార్పు చేస్తారు.

పాత, కొత్త విధానాలు..

ప్రస్తుతం రెండు విధానాలలో ఆదాయపు పన్ను చెల్లించే అవకాశం ఉంది. పాత, కొత్త పద్దతులను చెల్లింపు దారులు ఎంపిక చేసుకోవాలి. ఈ రెండు విధానాలలో పన్ను మినహాయింపుల విషయంలో తేడాలుండాయి. మనకు వచ్చిన ఆదాయం ఆధారణంగా ఈ రెండు విధానాలలో ఒకదానికి ఎంపిక చేసుకోవాలి. ఐటీఆర్ అందజేయడం ఆలస్యమైతే మీరు పాత విధానం ఎంపికను కోల్పోతారు. ముఖ్యంగా కొత్త పన్ను విధానంలో మార్చడం వల్ల కొన్ని మినహాయింపులను కోల్పోయే ప్రమాదం ఉంది. తద్వారా మీరు పన్ను కట్టే ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.

జరిమానా..

ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్)ను గడువు లోపు అందజేయకపోతే అనేక నష్టాలు కలుగుతాయి. జూలై 31 వరకూ ఆదాయపు పన్ను శాఖ విధించిన గడువు ఉంది. ఆ సమయానికి అందజేయకపోతే జరిమానాతో డిసెంబర్ 31 వరకూ అందజేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం ఐటీఆర్ ఆలస్యంగా ఫైలింగ్ చేసినందుకు రూ.5 వేలు జరిమానా విధిస్తారు. అయితే మీ ఆదాయం రూ.5 లక్షలకు మించకపోతే ఈ జరిమానా కేవలం రూ.వెయ్యి మాత్రమే ఉంటుంది. వీటితో పాటు గడువు తేదీ నుంచి బకాయి ఉన్న పన్ను మొత్తానికి నెలకు ఒక శాతం లేదా నెలలో కొంత భాగానికి వడ్డీ విధిస్తారు. అలాగే ఐటీఆర్ ఆలస్యం కావడం వల్ల వాపసులపై వడ్డీని కోల్పోతారు. వీటితో పాటు పన్ను బకాయిలను సకాలంలో చెల్లించకపోతే జైలుశిక్ష కూడా ఉంటుంది. కాబట్టి పన్ను చెల్లింపుదారులు గడువులోపు ఐటీఆర్ సమర్పించడం చాలా ఉత్తమం. గడువు దగ్గర పడిన తర్వాత హడావుడి పడడం కన్నా ముందుగానే సమర్పించడం వల్ల అనేక ఉపయోగాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టం కింద మీకు లభించే మినహాయంపులన్నింటినీ సక్రమంగా క్లెయిమ్ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..