
కారు కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో తక్కవ ధరకే ఎక్కవ ఫీచర్స్ అందించే కారును కొనాలని జనాలు చూస్తారు. మీరు కూడా సరసమైన ధరకే, స్టైలిష్ మైక్రో-SUV కొనాలని చూస్తున్నట్లయితే మీకు టాటా పంచ్ చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇది బిల్డ్ క్వాలిటీ, శక్తివంతమైన డిజైన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరతో మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉంటుంది. కానీ ఇక్కడ చాలా మందికి ఉన్న ప్రశ్న ఏమిటంటే. ఈ కారు కొనడానికి నెలకు సంపాదన ఎంత ఉండాలి అని. ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి?లో ఇప్పుడు చూద్దాం.
టాటా పంచ్ కారు ధర పూర్తి వివరాలు
2026 స్మార్ట్ మాన్యువల్ పెట్రోల్ కలిగిన బేస్ వేరియంట్ టాటా పంచ్ కారు ఎక్స్-షోరూమ్ ధర ప్రస్తతుం మార్కెట్‌లో రూ. 5.60 లక్షలుగా ఉంది. RTO ఛార్జెస్, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలతో సహా ఆన్-రోడ్ ధర దాదాపు 6.65 లక్షల వరకు ఉంటుంది. మీరు 1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే, మీరు దాదాపు 5.65 లక్షల కారు లోన్ తీసుకోవలసి ఉంటుంది. బ్యాంకులు లేదా NBFCలు సాధారణంగా 5 సంవత్సరాల అంటే 60 నెలలు వరకు లోన్స్ ఇస్తాయి. అంటే సంవత్సరానికి 10% వడ్డీ రేటు అనుకుంటే ఈ లోన్ కోసం నెలవారీ EMI దాదాపు రూ.12వేల వరకు ఉండొచ్చు.
మొత్తం వడ్డీ ఎంత?
మీరు లక్ష రూపాయల డౌన్ పేమెంట్‌తో కారును కొని ఐదేళ్లు ఈఎమ్‌ఐ పెట్టుకుంటే.. 5 సంవత్సరాల వ్యవధిలో రూ.5.65 లక్షల రుణంపై మొత్తం వడ్డీ దాదాపు రూ. 155,000 వరకు కావొచ్చు. అంటే మీరు రూ.5.65 లక్షల రుణంపై మొత్తం రూ. 7.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు EMI తక్కువగా ఉంటుంది. అలాగే తక్కువ డౌన్ పేమెంట్ఉంటుంది, కానీ మొత్తం వడ్డీ ఎక్కువగా కనిపిస్తోంది.
నిపుణులు ఏమంటున్నారు?
ఇలా మీరు ఎక్కువ వడ్డీని చెల్లించే కంటే కారు కొనేప్పుడే ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టి కారును కొనాలని చెబుతున్నారు. దీనివల్ల లోన్ మొత్తంపై వడ్డీ భారం తగ్గుతుంది. తక్కువ లోన్ వ్యవధి వడ్డీని తగ్గిస్తుంది, కానీ EMI కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కారు కొనడానికి ముందు, మీరు మీ నెలవారీ ఆదాయం, ఇతర ఖర్చు, ఇప్పటికే ఉన్న రుణాలను అంచనా వేయాలి. మీ మొత్తం EMI మీ నెలవారీ ఆదాయంలో 35-40% మించకుండా చూసుకోండి. అంటే మీకు ఇప్పటి వరకు ఏలాంటి EMI లేవు ఖర్చులు కూడా లేవు అనుకుంటే మీకు 35-50వేల సంపాదన ఉన్న మీరు ఈ కారును కొనవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, లేదా నివేదికల, నిపుణుల సమాచారం మేరకు మాత్రమే అందించబడింది. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ దగ్గర్లోని షోరూమ్‌ను సంప్రదించండి. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.