Tata Punch: స్పెషల్ ఎడిషన్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన టాటా పంచ్.. ప్రీమియం ఫీచర్లు.. ధర ఎంతంటే..

|

Oct 06, 2024 | 4:22 PM

మైక్రో ఎస్‌యూవీ మోడల్ టాటా పంచ్ కొత్త వెర్సన్ ను కంపెనీ లాంచ్ చేసింది. టాటా పంచ్ కామో ఎడిషన్ పేరుతో దీనిని రీలాంచ్ చేసింది. దీనిని మొదటి సారి 2022 సెప్టెంబర్లో టాటా లాంచ్ చేసింది, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2024 ఫిబ్రవరిలో దీనిని డిస్ కంటిన్యూ చేసింది. ఇప్పుడు దీనిని మళ్లీ అప్ గ్రేడ్ చేసి రీలాంచ్ చేసింది.

Tata Punch: స్పెషల్ ఎడిషన్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన టాటా పంచ్.. ప్రీమియం ఫీచర్లు.. ధర ఎంతంటే..
Tata Punch Camo Edition
Follow us on

మన దేశీయ మార్కెట్లో టాటా కార్లకు మంచి డిమాండ్ ఉంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు, అధిక పనితీరుతో ఉండే ఈ కంపెనీ కార్లను ప్రజలు ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. కాగా టాటా నుంచి అందుబాటులో ఉన్న మైక్రో ఎస్‌యూవీ మోడల్ టాటా పంచ్ కొత్త వెర్సన్ ను కంపెనీ లాంచ్ చేసింది. టాటా పంచ్ కామో ఎడిషన్ పేరుతో దీనిని రీలాంచ్ చేసింది. దీనిని మొదటి సారి 2022 సెప్టెంబర్లో టాటా లాంచ్ చేసింది, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2024 ఫిబ్రవరిలో దీనిని డిస్ కంటిన్యూ చేసింది. ఇప్పుడు దీనిని మళ్లీ అప్ గ్రేడ్ చేసి పంచ్ కామో ఎడిషన్ పేరుతో రీలాంచ్ చేసింది. దీనిలో ఎంటీ, ఏంటీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రారంభ ధరలు ఎంటీ వెర్షన్ అయితే రూ. 8.45లక్షలు, ఏఎంటీ వెర్షన్ అయితే 9.05లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. ఈ కారును మీ సమీప డీలర్ వద్ద లేదా ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చు.

కొత్త ఫీచర్లు..

టాటా పంచ్ కామో ఎడిషన్లో ఫీచర్లను కంపెనీ అప్ డేట్ చేసింది. అలాగే డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ తో వస్తుంది. గ్రీన్ జాబ్, వైట్ రూఫ్ తో వస్తోంది. 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఓవరాల్ లేఅవుట్ స్టాండర్డ్ మోడల్ లాగానే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, వైర్ లెస్ చార్జర్, వెనుకవైపు ఏసీ వెంట్లు, ఫాస్ట్ సీ టైప్ యూఎస్బీ చార్జర్, సెంటర్ కన్సోల్ ఉంటుంది.

మెకానికల్ అంశాల విషయానికి వస్తే పంచ్ కామో ఎడిషన్ కారులో 1.2 లీటర్ 3-సిలెండర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. 86హెచ్పీతో పాటు 113ఎన్ఎం టార్క్ వస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బ్యాక్స్ తో పాటు ఏఎంటీ ఆప్షన్ కూడా ఉంటుంది. సీఎన్జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. సీఎన్జీలో 73.4హెచ్పీ, 103ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. స్పీడ్ మాన్యవల్ గేర్ బ్యాక్స్ ఉంటుంది.

టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియన్ ఆఫీసర్ వివేక్ శ్రీవాస్తవా ఈ లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కారు లాంచ్ చేసినప్పటి నుంచి దీని స్టన్నింగ్ డిజైన్ కి అందరి నుంచి మన్ననలు వస్తున్నాయన్నారు. దీని అధిక పనితీరు, స్పేషియస్ ఇంటీరియర్స్, భద్రతా ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు. టాటా పంచ్ నకు డిమాండ్ పెరుగుతున్నట్లు ఆయన వివరించారు. వినియోగదారులకు తమ ఫేవరెట్ ఎస్ యూవీగా మారుతోందని చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..