Indian Railways: పండుగ సెలవుల్లో తిరుమల వెళ్లేవారికి సూపర్ న్యూస్.. ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ.. ఇప్పుడే బుక్ చేస్కోండి..

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. పండుగ సెలవుల కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తున్నారు. దీంతో తిరుపతికి రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ స్పెషల్ రైళ్లల్లో బెర్త్‌ల వివరాలను కూడా ప్రకటించింది. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Indian Railways: పండుగ సెలవుల్లో తిరుమల వెళ్లేవారికి సూపర్ న్యూస్.. ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ.. ఇప్పుడే బుక్ చేస్కోండి..
Indian Railway

Updated on: Oct 18, 2026 | 4:22 PM

దసరా, దీపావళి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతోంది. తెలుగు రాష్ట్రాల మీదుగా వివిధ మార్గాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ రెండూ పెద్ద పండుగలు కావడం, స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల్లో నివసించేవారు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లల్లో ఇప్పటికే రిజర్వేషన్లు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే అనేక స్పెషల్ ట్రైన్లను ప్రవేశపెట్టగా.. తాజాగా వీటిల్లో ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను ప్రకటించింది.,

చర్లపల్లి-ససారం(07041) రైల్లో అక్టోబర్ 22న 373, నవంబర్ 19న 527 బెర్త్‌లు, నవంబర్ 26న 699 బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. ఇక సికింద్రాబాద్-శ్రీకాకుళం(07425) ట్రైన్‌లో అక్టోబర్ 25న 343, నవంబర్ 1న 528, నవంబర్ 8న 657, నవంబర్ 15వ తేదీన 643, నవంబర్ 22న 628, నవంబర్ 29వ తేదీన 647 బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. ఇక చర్లపల్లి-శ్రీకాకుళం(07037) రైలులో అక్టోబర్ 27న 484, నవంబర్ 3వ తేదీన 634, నవంబర్ 10న 714, నవంబర్ 17న 721, నవంబర్ 24న 630 బెర్త్‌లు ఖాళీగా ఉన్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇక సికింద్రాబాద్-విశాఖపట్నం(07017) రైలులో అక్టోబర్ 18న 864 బెర్తులు ఖాళీగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

అలాగే దసరా పండుగల సెలవుల కారణంగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు. దీంతో తిరుపతి మార్గంలో  రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా జల్నా-తిరుపతి(07814) ప్రత్యేక రైలులో అక్టోబర్ 22వ తేదీన 76 బెర్తులు, అక్టోబర్ 29న 283 బెర్తులు ఖాళీగా ఉండగా.. నవంబర్ 5వ తేదీన 516, నవంబర్ 19న 343, నవంబర్ 26న 690 బెర్తులు అందుబాటులో ఉన్నాయి.  అలాగే హెచ్.ఎస్. నాందేడ్-తిరుచానూరు(07603) ట్రైన్‌లో అక్టోబర్ 20వ తేదీన 508 బెర్తులు, అక్టోబర్ 27న 587 బెర్తులు ఉండగా.. నవంబర్ 3వ తేదీన 847, నవంబర్ 10న 489, నవంబర్ 17న 756, నవంబర్ 24న 858 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. తిరుమల వెళ్లేవారికి ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి. అలాగే సికింద్రాబాద్- కాకినాడ(07039) ట్రైన్‌లో అక్టోబర్ 21వ తేదీన 92 బెర్తులు, అక్టోబర్ 28వ తేదీన 623 బెర్తులు, నవంబర్ 4న 731, నవంబర్ 11న 777, నవంబర్ 18న 774, నవంబర్ 25న 758 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. చర్లపల్లి నుంచి నరసాపురం వెళ్లే రైలు నంబర్ 07063లో అక్టోబర్ 19వ తేదీన 23 బెర్తులు, అక్టోబర్ 26వ తేదీన 365 బెర్తులు, నవంబర్ 2న 464, నవంబర్ 9న 468, నవంబర్ 16న 470, నవంబర్ 23న 470, నవంబర్ 30న 468 బెర్తులు అందుబాటులో ఉన్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us