Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు.. షెడ్యూల్ వివరాలు ఇవిగో..

దక్షిణ మధ్య రైల్వే వీక్లీ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. కోయంబత్తూర్-జైపూర్ జోన్, జైపూర్ జోన్-కోయంబత్తూర్ జోన్, బాంద్రా-వేళంకన్ని, వేళంకన్ని-బాంద్రా, పూరీ-సోలాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్ల వివరాలను తాజాగా వెల్లడించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు.. షెడ్యూల్ వివరాలు ఇవిగో..
Indian Railways

Updated on: Aug 05, 2026 | 5:06 PM

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీని తగ్గించేందుకు వీక్లీ స్పెషల్ రైళ్లను పలు మార్గాల్లో కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. కోయంబత్తూర్-జైపూర్, బాంద్రా టెర్మినల్-వేళంకన్ని, పూరీ-సోలాపూర్ మధ్య వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. ఏయే తేదీల్లో అందుబాటులో ఉంటాయనే సమాచారంతో పాటు ఏయే స్టేషన్లలో ఆగుతాయనే వివరాలను ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

కోయంబత్తూర్-జైపూర్ జోన్(06181), జైపూర్ జోన్-కోయంబత్తూర్ జోన్(06182), బాంద్రా-వేళంకన్ని(09059), వేళంకన్ని-బాంద్రా(09060), పూరీ-సోలాపూర్(08445) మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కోయంబత్తూర్-జైపూర్ జోన్(06181) ప్రత్యేక రైలు ఈ నెల 13వ తేదీ నుంచ సెప్టెంబర్ 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. జైపూర్ జోన్-కోయంబత్తూర్ జోన్(06182) రైలు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు సర్వీసులు అందించనుంది. బాంద్రా-వేళంకన్ని(09059) ఈ నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు సర్వీసులు అందించనుంది. వేళంకన్ని-బాంద్రా(09060) ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు అందుబాటులో ఉంటుంది. పూరీ-సోలాపూర్(08445) ఆగస్ట్ 7న అందుబాటులో ఉంటుంది.

కోయంబత్తూర్ – జైపూర్ – కోయంబత్తూర్ వీక్లీ ప్రత్యేక రైళ్లు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేట, కాట్పాడి, రేణిగుంట, కడప, యర్రగుంట్ల, గూటి, ధోనే, కర్నూలు సిటీ, గద్వాల్, మహబూబ్ నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, బాసర్, ముద్ఖేడ్, హజూర్ సాహిబ్ నాందేడ్, పూర్ణ, హింగోలి దక్కన్, వాషిమ్, అకోలా, మల్కాపూర్, భుసావల్, జల్గావ్, ధరంగావ్, నందుర్బార్, ఉద్నా, భరూచ్, వడోదర, గోద్రా, రత్లాం,
జాయోరా, మాంద్సోర్, నిమాచ్, చిత్తౌర్‌ఘర్, భిల్వారా, బీజైనగర్, నసీరాబాద్, అజ్మీర్, కిషన్‌గఢ్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని 3AC కోచ్‌లు ఉంటాయి. ఇక వేలంకన్ని – బాంద్రా ప్రత్యేక రైళ్లు బోరివలి, వాసాయి రోడ్, పన్వెల్, కర్జాత్, లోనావాలా, పూణే, దౌండ్, షోలాపూర్, వాడి, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, వెల్లూరు కాంట్, తిరువణ్ణామలై, విల్లుపురం, మైలదుతురై జోన్, నాగపట్టినం స్టేషన్లలో ఆగుతాయి. 2AC, 3 AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. పూరి – షోలాపూర్ ప్రత్యేక రైలు ఖుర్దా రోడ్, బ్రహ్మపూర్, విజయనగరం, దువ్వాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, వాడి, కలబురగి స్టేషన్లలో ఆగుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us