
దేశవ్యాప్తంగా ఎల్‌నివో ప్రభావం వల్ల నీటి, విద్యుత్ సమస్య ఏర్పడుతుంది. వర్షాలు లేకపోవడం వల్ల భూగర్బ జలాలు అడుగంటిపోవడంతో దేశవ్యాప్తంగా నీటి సమస్య వేధిస్తోంది. అలాగే విద్యుత్ కోతలు కూడా ప్రజలకు ఇబ్బందిని కల్గిస్తున్నాయి. దీంతో నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రజలు దృష్టి పెడుతున్నారు. ఎల్‌నివో ప్రభావం వల్ల ఎండ తీవ్రత కొనసాగుతుండటంతో ఇళ్లల్లో విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. దీన వల్ల కరెంట్ కోతలు తప్పడం లేదు. ఈ సమస్య నుంచి బయటపడటానికి సోలార్ లైట్లు బాగా ఉపయోగపడుతున్నాయి. సూర్యకాంతి ద్వారా విద్యుత్‌ను జనరేట్ చేసుకుని ఆటోమేటిక్‌గా పనిచేసే ఈ లైట్లకు ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది.
మాములుగా లైట్లు వెలగాలంటే విద్యుత్ అవసరం. కానీ ఈ లైట్లకు విద్యుత్ కనెక్షన్ అక్కర్లేదు. కేవలం సూర్యరశ్మి ద్వారా పనిచేస్తాయి. సూర్యుడు ఉన్న సమయంలో ఛార్జింగ్ అవుతాయి. సాయంత్రం కాగానే వాతంట అవే వెలుగుతాయి. వర్షం, ఎండ, దుమ్మ వంటి వాటి వల్ల చెడిపోకుండా వాటర్ ప్రూఫ్ బాడీ కలిగి ఉంటాయి. లైట్లకు వైర్లు, స్విచ్‌లు వంటి వాటి ద్వారా పనిచేస్తాయి. వీటికి వైర్లు, స్విచ్ కనెక్షన్ కూడా అవసరం లేదు. వీటిని ఇంట్లో సులువుగా అమర్చుకోవచ్చు. మీరు ఏ ప్రాంతంలో అమర్చుకోవాలనుకుంటున్నారనే విషయాన్ని బట్టి వివిధ మోడళ్లలో సోలార్ లైట్లు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరం, ఏ ప్రదేశంలో ఉపయోగించుకోవాలి అనే దానిని పరిగణలోకి తీసుకుని లైట్లను కొనుగోలు చేయవచ్చు. అంతేకదు వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. కేవలం రూ.200 నుంచి వీటి ధరలు ఉన్నాయి.
వోల్టేజ్, బ్యాటరీ సామర్థ్యం, ఇతర ఫీచర్ల ఆధారంగా లైట్ల ధరలు మారుతుంటాయి. గ్యార్డెన్ డెకరేటివ్ సోలార్ లైట్లు రూ.200 నుంచి రూ.వెయ్యి మధ్య లభ్యమవుండగా.. సోలార్ వాల్ సెన్సార్ లైట్లు రూ.450 నుంచి మొదలవుతున్నాయి. ఇక ట్యూబ్ లైట్లు, ఎమర్జెన్సీ లాంతర్లు రూ.800 నుంచి ధరలు ప్రారంభమవుతున్నాయి. సోలార్ ఆల్ ఇన్ వన్ స్ట్రీట్ లైట్లు రూ.1200కి విక్రయిస్తున్నారు. హోమ్ లైటింగ్ కిట్స్ వచ్చి రూ.3 వేల నుంచి లభిస్తున్నాయి. వీటి వల్ల మీ కరెంట్ బిల్లు కూడా ఆదా చేసుకోవచ్చు. మీ ఇంటి బాల్కనీ, గేట్లు, గార్డెన్ వంటి ఏరియాల్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల కరెంట్ లేకపోయినా మీ ఇంట్లో విద్యుత్ ఉంటుంది. విద్యుత్ కోతల నుంచి బయటపడేందుకు ఈ సోలార్ లైట్లు మంచి ప్రత్యామ్నాయంగా ఉన్నాయి.