
దేశంలో కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. సుకన్య సమృద్ది యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్రతో పాటు పోస్టాఫీస్ పథకాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చూస్తూ ఉంటారు. అయితే వడ్డీ రేట్లను ప్రతీ త్రైమాసికానికి కేంద్రం ప్రకటిస్తూ ఉంటుంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లను సెప్టెంబర్ 30న ప్రకటించనుంది. దీంతో కొత్త వడ్డీ రేట్లపై పెట్టుబడిదారుల్లో ఆసక్తి నెలకొంది. వడ్డీ రేట్లను పెంచుతుందా..? లేదా తగ్గిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేంద్రం కొన్నేళ్లుగా వడ్డీ రేట్లను సవరించడం లేదు. యథావిధిగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంటుంది. దీంతో ఈ సారి కూడా అదే బాటలో నడుస్తుందా..? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. కొత్త వడ్డీ రేట్ల గురించి పెట్టుబడిదారులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకు ఒకసారి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది .2026 జూన్ 30న జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన వడ్డీ రేట్లను ప్రకటించింది. ఇప్పుడు సెప్టెంబర్ 30న అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి వర్తించే వడ్డీ రేట్లను వెల్లడించనుంది. పోస్టాఫీస్ స్కీములతో పాటు పీపీఎఫ్, సుకన్య సమృద్ది యోజన పథకాల్లో ఎక్కువమంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే వీటి వడ్డీ రేట్లను నిర్ణయించడంలో ప్రభుత్వ బాండ్ల రాబడులు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వ సెక్యూరిటీల రాబడులను ఒక బెంచ్ మార్క్‌గా తీసుకుంటారు. ప్రభుత్వ బాండ్లలో పెరుగుదల నమోదువుతున్న క్రమంలో.. పొదుపు ఖాతాల వడ్డీ రేట్లపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 30న రానున్న ప్రకటన కోసం నిరీక్షిస్తున్నారు.
స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లలో చిన్న మార్పు జరిగినా పెట్టుబడిదారులు ఎన్నో ఏళ్లుగా సంపాదిస్తున్న మొత్తం రాబడిపై ప్రభావం చూపుతుంది. కిసాన్ వికాస్ పత్రకు సంబంధించి వడ్డీ రేట్లతో పాటు మెచ్యూరిటీ కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ బాండ్ల రాబడులు పెరిగినంత మాత్రాన పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్రం పెంచుతుందనేది చెప్పలేం. తుది రేట్లను అంతిమంగా కేంద్రమే నిర్ణయిస్తుంది. ప్రభుత్వ పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ట్యాక్స్ మినహాయింపులు ఉంటాయి .దీంతో ట్యాక్స్ సేవింగ్స్ కోసం ఉద్యోగులు, వ్యాపారులు వీటిల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడి, రిస్క్ లేని పెట్టుబడులు కోరుకునేవారు వీటిల్లో తమ డబ్బును ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ పెట్టుబడులకు ప్రభుత్వ హామీ ఉంటుంది.