SIR Online: మీరు ఇంటి వద్ద లేరా..? నిమిషాల్లోనే ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ఫారం నింపొచ్చు.. పూర్తి ప్రాసెస్ ఇదే..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే చాలామంది వ్యాపారం, విద్య, ఉపాధి కారణాలతో వేర్వేరు ప్రాంతాల్లో ఉంటారు. ఇలాంటివారు ఆన్‌లైన్‌లో కూాడా ఎస్‌ఐఆర్ ఫారం నింపవచ్చు. అనంతరం దీనిని మీ బీఎల్‌ఓకు అందిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో ఎలా నింపాలనేది ఇప్పుడు చూద్దాం.

SIR Online: మీరు ఇంటి వద్ద లేరా..? నిమిషాల్లోనే ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ఫారం నింపొచ్చు.. పూర్తి ప్రాసెస్ ఇదే..
Sir Online

Updated on: Jul 11, 2026 | 5:51 PM

ఏపీ, తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్​ఐఆర్) ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో ఈ ప్రక్రియ ముగియనుంది. ఇందులో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్‌ఓలు) ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలు అందిస్తున్నారు. వీటిని ఓటర్లు పూర్తి చేసి మళ్లీ బీఎల్‌ఓకు అందించాలి. ఒకవేళ మీరు ఎస్‌ఐఆర్‌లో పాల్గొనకపోతే ఓటు హక్కు కోల్పోతారు. ఏపీలో ఈ నెల14వ తేదీ వరకు సమయం ఉండగా.. తెలంగాణలో ఈ నెల 24వ తేదీ వరకు టైమ్ ఉంది. అయితే ఆఫ్‌లైన్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా ఎన్యూమరేషన్ ఫారం నింపవచ్చు. ఈ మేరకు ఎన్నికల సంఘం అవకాశం కల్పి్స్తోంది. ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి? ఈ ప్రాసెస్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ఫారం నింపడం ఎలా..?

-https://voters.eci.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయండి

-హోం పేజీలో ఫిల్ ఎన్యూమరేషన్ ఫారంపై క్లిక్ చేయండి

-మీ ఓటర్ ఐడీ నెంబర్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి

-మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి

-అనంతరం అవసరమైన వివరాలు నింపండి

-వివరాలను నింపిన తర్వాత బీఎల్‌ఓకు అందించండి

ఏయే వివరాలు నింపాలి

-మీ పేరు, ఓటర్ ఓడీ నెంబర్, అడ్రస్, పోలింగ్ సెంటర్ వివరాలు, నియోజకవర్గం వివరాలు నింపాలి

-2002లో ఓటర్ లిస్టులో మీ పేరు ఉంటే ఎంటర్ చేయాలి. మీ పేరు లేకపోతే మీ పేరెంట్స్, ఇతర కుటుంబభస్యులు, సంబంధీకుల పేర్లు నమోదు చేయాలి

-మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్, మొబైల్ నెంబర్, మీ తల్లిదండ్రుల ఓటర్ ఐడీ నెంబర్, మీ ఫొటో అతికించి బీఎల్‌ఓకు అందించాలి

-రెండు పత్రాల్లో ఒకదానిపై బీఎల్ఓ సంతకం చేసి మీకు అందిస్తారు. దాన్ని మీ దగ్గర ఉంచుకోవాలి

2002 ఓటర్ జాబితాలో మీ తల్లిదండ్రుల పేర్లు గుర్తించడం ఎలా..?

-https://voters.eci.gov.in పోర్టల్‌లో అప్పట్లో మీ తల్లిదండ్రులు నివసించిన జిల్లా, నియోజకవర్గం, ఇంటి పేరుతో సెర్చ్ చేస్తే మీ తల్లిదండ్రలు వివరాలు కనిపిస్తాయి.
-బీఎల్ఓలకు మీ తల్లిదండ్రుల పేర్లు చెబితే వాళ్లే వెతికి పెడతారు.

మీరు ఇంటి వద్ద లేకపోతే ఏం చేయాలి..?

మీ కుటుంబసభ్యులు లేదా బంధువులు, స్నేహితులకు చెప్పాలి. వాళ్లే మీ తరపున ఎన్యూమరేషన్ ఫారం నింపి బీఎల్‌ఓకు అందించవచ్చు. మీ తరపున వాళ్లే సంతకం చేసి బీఎల్ఓకు ఇవ్వాలి. ఎన్యూమరేషన్ ఫారం నింపకపోతే ఓటు హక్కు కోల్పోతారు. దీంతో ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఈ ప్రాసెస్ పూర్తి చేయాలి. మీరు ఇంటి వద్ద లేకపోతే బీఎల్‌ఓ నెంబర్లు ఈసీ వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి. వారికి కాల్ చేసి ఎన్యూమరేషన్ ఫారం నింపడంలో సహాయం పొందవచ్చు.

Follow Us