ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే లాభామా? నష్టమా? నిపుణుల సూచన ఇదే!

ప్రస్తుతం చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్నారు. ఇవి డబ్బు నిర్వహణను సులభతరం చేస్తాయి, బ్యాకప్‌గా ఉంటాయి, ప్రత్యేక ఆఫర్లను అందిస్తాయి. అయితే, ప్రతి ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్, వార్షిక ఛార్జీలు, పన్ను చిక్కుల వంటి నష్టాలు కూడా ఉన్నాయి.

ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే లాభామా? నష్టమా? నిపుణుల సూచన ఇదే!
Multiple Bank Accounts

Updated on: Mar 03, 2026 | 9:59 PM

ప్రస్తుతం చాలా మంది ఒకే బ్యాంక్ ఖాతాతో కాకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను నిర్వహిస్తున్నారు. సాలరీ అకౌంట్‌, సేవింగ్స్ అకౌంట్‌, బిజినెస్‌ అకౌంట్‌, కరెంట్‌ అకౌంట్‌ ఇలా అవసరాల ప్రకారం ఖాతాలు పెరుగుతున్నాయి. అయితే ఎక్కువ అకౌంట్లు కలిగి ఉండటం లాభదాయకమా లేదా భారమా అన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

లాభాల విషయానికి వస్తే ఖర్చుల నియంత్రణ సులభమవుతుంది. ఉదాహరణకు జీతం కోసం ఒక ఖాతా, సేవింగ్స్ కోసం మరో ఖాతా ఉంచితే డబ్బు నిర్వహణ క్రమబద్ధంగా ఉంటుంది. ఒక బ్యాంక్‌లో సర్వర్ సమస్యలు వచ్చినా, మరో ఖాతా ద్వారా లావాదేవీలు కొనసాగించవచ్చు. అలాగే కొన్ని బ్యాంకులు అధిక వడ్డీ లేదా ప్రత్యేక ఆఫర్లు ఇస్తాయి కాబట్టి వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. భద్రత పరంగా కూడా మొత్తం డబ్బు ఒకే చోట కాకుండా విభజించి ఉంచడం కొంతవరకు రిస్క్ తగ్గిస్తుంది.

లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ప్రతి ఖాతాలో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్) నిర్వహించాల్సి రావడం ప్రధాన భారంగా మారుతుంది. అది పాటించకపోతే జరిమానాలు విధించే అవకాశం ఉంది. అలాగే ఎక్కువ డెబిట్ కార్డులు, పాస్‌బుక్లు, యూపీఐ లింకులు ఉండటం వల్ల మేనేజ్ చేయడం కాస్త క్లిష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో వార్షిక చార్జీలు, SMS చార్జీలు వంటి అదనపు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను దాఖలు సమయంలో అన్ని ఖాతాల వివరాలు ఇవ్వాల్సి రావడం వల్ల గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా అవసరం ఉన్నప్పుడే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంచడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us