రూపాయి వీక్.. సెన్సెక్స్, నిఫ్టీ ఓకే..

| Edited By:

Aug 26, 2019 | 5:04 PM

ఫైన్సాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకటనలతో.. సోమవారం దేశీయ మార్కెట్లు జోష్‌లో కొనసాగాయి. మరోవైపు అమెరికా- చైనా మధ్య కూడా మరోసారి వాణిజ్య చర్చలు మొదలుకానున్న సంకేతాలు కూడా సూచీల జోరును రెట్టింపు చేశాయి. మార్కెట్ ప్రారంభంలో కాస్త ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయినా.. ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత దూకుడు పెంచి భారీ లాభాలతో ముగించాయి. సెన్సెక్స్‌ 793 పాయింట్లు లాభపడి 39494 వద్ద ముగియగా.. నిఫ్టీ 229 పాయింట్లు లాభపడి […]

రూపాయి వీక్.. సెన్సెక్స్, నిఫ్టీ ఓకే..
Follow us on

ఫైన్సాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకటనలతో.. సోమవారం దేశీయ మార్కెట్లు జోష్‌లో కొనసాగాయి. మరోవైపు అమెరికా- చైనా మధ్య కూడా మరోసారి వాణిజ్య చర్చలు మొదలుకానున్న సంకేతాలు కూడా సూచీల జోరును రెట్టింపు చేశాయి. మార్కెట్ ప్రారంభంలో కాస్త ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయినా.. ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత దూకుడు పెంచి భారీ లాభాలతో ముగించాయి. సెన్సెక్స్‌ 793 పాయింట్లు లాభపడి 39494 వద్ద ముగియగా.. నిఫ్టీ 229 పాయింట్లు లాభపడి 11058 వద్ద ముగిసింది. ఒకానొక సమయంలో 800 పాయింట్లకు పైగా ఎగబాకిన సెన్సెక్స్‌ చివరకు 793 పాయింట్లు లాభపడింది.

మరోవైపు కరెన్సీ మార్కెట్లో ఇవాళ రూపాయి విలువ భారీగా పతనమైంది. ఉదయం డాలర్‌తో పోలిస్తే రూ.72.03 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించి.. ఒక దశలో రూ.72.25కు చేరింది. ప్రస్తుతం కాస్త కోలుకుని 71.94 గా కొనసాగుతోంది. 2019లో ఇంత స్థాయిలో రూపాయి ఎప్పుడు నష్టాలను చూడలేదు.