
హైదరాబాద్ నవంబర్ 10th: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మరింత వేగవంతమైన ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి – తిరుచానూరు – చర్లపల్లి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు వేగాన్ని పెంచుతూ, దానిని ఎక్స్‌ప్రెస్ కేటగిరీ నుంచి సూపర్‌ఫాస్ట్ కేటగిరీకి మారుస్తున్నట్లు అధికారులు ప్రకటించింది. ఈ మార్పులకు అనుగుణంగా రైలు నంబర్లతో పాటు సమయాల్లో కూడా మార్పులు చోటుచేసినట్టు తెలిపింది. 2027 జనవరి 1వ తేదీ నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది.
మారిన ట్రైన్ నంబర్లు
చల్లపల్లి – తిరుచానూర్ సర్వీస్
గతంలో 17047 నెంబర్‌తో నడిచే చర్లపల్లి – తిరుచానూరు ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత 12729 నంబర్‌తో రాకపోకాలు సాగించనుంది. ఈ రైలు చర్లపల్లి స్టేషన్ నుంచి సాయంత్రం 18:55 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 08:00 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది.
తిరుచానూరు – చర్లపల్లి సర్వీస్
గతంలో 17048 నెబర్‌తో నడిచే తిరుచానూర్- చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత 12730 నెంబర్‌తో రాకపోకలు సాగించనుంది. ఈ తిరుచానూరులో సాయంత్రం 16:55 గంటలకు బయలుదేరే ఈ రైలు, గతంలో ఉదయం 07:00 గంటలకు చర్లపల్లి చేరుకునేది. వేగం పెంచడంతో ఇకపై గంట ముందుగానే, అంటే ఉదయం 06:00 గంటలకే చర్లపల్లి చేరుకోనుంది.
రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో తిరుపతి, తిరుచానూరు పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులకు టైం చాలా వరకు తగ్గనుంది. 2027 జనవరి 1 నుంచి చల్లపల్లి- తిరుచానూర్ మధ్య ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. కాబట్టి రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులు మారిన రైలు నంబర్లు, సమయాలను గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.