State Bank Of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంవత్సరంలో కొత్త ఇల్లు కట్టుకొవాలనుకునేవారికి సూపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి కల కూడా నెరవేరనుంది. మరీ ఆ ఆఫర్ ఎంటో తెలుసుకుందామా..
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోం లోన్ వడ్డీ రైట్లపై 30 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ అందిస్తోంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజును కూడా పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ భారీ ఆఫర్లతో హోం లోన్ తీసుకునే వారికి మంచి అవకాశాలు కలగనున్నాయి. ఇక ఎస్బీఐలో రూ.30 లక్షల వరకు హోం లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 6.8 శాతం ఉంటుంది. అవికాకుండా రూ.30 లక్షలకు పైగా హోం లోన్ తీసుకుంటే 6.95 శాతం వడ్డీకే లోన్ వస్తుంది. హోంలోన్ వడ్డీ ట్లు సిబిల్ స్కోర్‌తో లింక్ అయి ఉండనుంది. అంతేకాకుండా రూ.5 కోట్ల వరకు హోం లోన్‌కు 30 బేసిస్ పాయింట్ల తగ్గింపు లభిస్తుందని తెలిపింది. ఇక 8 మెట్రో నగరాల్లో ఆ ఆఫర్ అందుబాటులో ఉంటుందని.. అలాగే మహిళలు తీసుకునే హోంలోన్లలో 5 బేసిస్ పాయింట్లు తగ్గింపు ఉంటుందని ఎస్బీఐ పేర్కోంది. ఇక ఎస్బీఐ యోనో యాప్ ద్వారా లోన్ తీసుకుంటే 5 బేసిస్ పాయింట్లు తగ్గింపు లభిస్తుందని తెలిపింది.
Also Read: SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ రుణాలపై బంపర్ ఆఫర్స్… వారికి మాత్రమే ఛాన్స్..
SBI Home Rates: కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి ఎస్బీఐ గుడ్ న్యూస్.. గృహ రుణాలపై రాయితీ.!