SBI positive pay system: చెక్కు ఫ్రాడ్‌లకు ఇక చెక్‌.. ఎస్బీఐ కొత్త సిస్టమ్‌‌తో పూర్తి భద్రత.. వివరాలు ఇవి..

|

Aug 05, 2023 | 3:50 PM

వినియోగదారులకు చెక్కు ఫ్రాడ్‌లపై అవగాహన కల్పించాలి. మోసగాళ్లు చొరబడే విధానం, ఆర్థిక నష్టాలు, చట్టపరమైన సమస్యలు, ప్రతిష్టకు భంగం వాటిల్లే కారణాలపై పూర్తిస్థాయిలో అవగాహన అవసరం. అందుకే దేశంలోని ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పాజిటివ్‌ పే సిస్టమ్‌ ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

SBI positive pay system: చెక్కు ఫ్రాడ్‌లకు ఇక చెక్‌.. ఎస్బీఐ కొత్త సిస్టమ్‌‌తో పూర్తి భద్రత.. వివరాలు ఇవి..
Sbi
Follow us on

బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎంత ఆధునికతను సమకూర్చుకున్నా.. దొంగలు ఏదో రకంగా ఇబ్బంది ఖాతాలకు కన్నం వేస్తూనే ఉన్నారు. ఏటీఎంల వద్ద సాయం పేరుతో చోరీలు, ఆన్‌లైన్‌ చొరబాట్లు మనం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా చెక్కుల విషయంలోనూ ఫ్రాడ్‌లు జరిగే ఆస్కారం ఎక్కువే ఉంది. అందుకే బ్యాంకుల్లో చెక్కుల మోసాలకు చెక్‌ పెట్టడం అత్యవసరం. అందుకోసం బ్యాకుంలే పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. వినియోగదారుల భద్రతకు, సౌకర్యానికి పెద్ద పీట వేయాలి. కస్టమర్ల నమ్మకాన్ని కాపాడుకోవాలి. వారికి చెక్కు ఫ్రాడ్‌లపై అవగాహన కల్పించాలి. మోసగాళ్లు చొరబడే విధానం, ఆర్థిక నష్టాలు, చట్టపరమైన సమస్యలు, ప్రతిష్టకు భంగం వాటిల్లే కారణాలపై పూర్తిస్థాయిలో అవగాహన అవసరం. అప్పుడే సురక్షితమైన బ్యాంకింగ్‌ అనుభవాన్ని వినియోగదారులు ఆస్వాదిస్తారు. అందుకే దేశంలోని ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పాజిటివ్‌ పే సిస్టమ్‌ ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎస్బీఐ పాజిటివ్ పే సిస్టమ్..

ఎస్బీఐ పాజిటివ్ పే సిస్టమ్ అనేది చెక్ సంబంధిత మోసాలను నివారించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన భద్రతా ఫీచర్‌. చెక్ ట్యాంపరింగ్/మార్పు ద్వారా జరిగే మోసాల నివారణకు ఇది ఉపయోగపడుతుంది. పాజిటివ్ పే సిస్టమ్‌లో చెక్కుకు సంబంధించిన కీలక వివరాలు డ్రాయర్ ద్వారా బ్యాంక్‌కి తిరిగి ధ్రువీకరించే వీలుంటుంది. ఇది చెల్లింపు ప్రాసెసింగ్ సమయంలో సమర్పించిన చెక్కుతో క్రాస్-చెక్ అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం, బ్యాంక్ జనవరి 1, 2021 నుంచి అమలులోకి వచ్చే అన్ని రకాల చెక్ పేమెంట్‌ల (నగదు/బదిలీ/క్లియరింగ్) కోసం పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్‌)ని ఎస్బీఐ అమలు చేస్తోంది. చెక్ మోసం నుండి కస్టమర్‌లను రక్షించడంలో సహాయపడే ఒక విలువైన భద్రతా చర్యగా పాజిటివ్ పే సిస్టమ్ నిపుణుల నుంచి కితాబు అందుకుంది. ఇది వినియోగదారులకు వారి చెక్కులు సురక్షితంగా ఉన్నాయని తెలుసుకుని మనశ్శాంతిని అందించడంలో సహాయపడే సులభమైన వ్యవస్థ.

రెండు విధాలుగా..

పాజిటివ్‌ పే సిస్టమ్‌ అనే దానిని మీరు వినియోగించాలంటే రెండు విధాలుగా మీరు రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుంది. అకౌంట్‌ రిజిస్ట్రేషన్‌, చెక్‌ ఆఫ్‌ లాడ్జిమెంట్‌.

ఇవి కూడా చదవండి

అకౌంట్‌ రిజిస్ట్రేషన్‌.. పాజిటివ్‌ పే సిస్టమ్‌లో చేరాలనుకొనే వినియోగదారులు చెక్ ఆపరేటెడ్ ఖాతాను వన్-టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందుకోసం బ్యాంకు సూచించిన ఫార్మాట్‌లో దరఖాస్తును సమర్పించాలి. అందుకోసం ఏదైనా బ్యాంక్‌ బ్రాంచ్‌లను సంప్రదించాలి. ఈ రిజిస్ట్రేషన్ను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా చేయవచ్చు. రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ (ఆర్‌ఐఎన్‌బీ), కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ (సీఐఎన్‌బీ), మొబైల్ బ్యాంకింగ్ (యోనో లైట్‌, యోనో) వంటి వాటిల్లో కూడా దీని రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం ఖాతా స్థాయి, పరిమితిని కస్టమర్‌లు ఎంచుకోవాలి. ఇది కస్టమర్‌ల రిస్క్ పర్సెప్షన్‌ను బట్టి ఎంతైనా కావచ్చు. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ ఉన్న సేవింగ్స్ బ్యాంక్ ఖాతా చెక్కులకు.. అలాగే రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ ఉన్న ఇతర ఇతర ఖాతాలు (కరెంట్ అకౌంట్/క్యాష్ క్రెడిట్/ఓవర్‌డ్రాఫ్ట్) పాజిటివ్ పే సిస్టమ్‌ను తప్పనిసరి చేయాలని బ్యాంకు ప్లాన్ చేస్తోంది.

లాడ్జిమెంట్ ఆఫ్‌ చెక్‌.. పీపీఎస్‌ కోసం నమోదు చేసుకున్న తర్వాత, కస్టమర్‌లు పాజిటివ్ పే సిస్టమ్‌కు ఎంపిక చేసిన ఖాతా స్థాయి పరిమితికి, అంతకంటే ఎక్కువ జారీ చేసిన చెక్కుల వివరాలను అందించాలి. అకౌంట్‌ నంబర్‌, చెక్‌ నంబర్‌, చెక్‌ తేదీ, చెక్‌ అమౌంట్‌, చెల్లించాలనుకొంటున్న వ్యక్తి పేరు, ఇన్‌స్ట్రుమెంట్‌ టైప్‌(ఎంఐసీఆర్‌ బ్యాండ్‌ పై కుడిచేతి వైపు కింద ఉండే రెండు డిజిట్ల నంబర్‌). ఈ చెక్‌ లాడ్జిమెంట్‌ ను బ్యాంక్‌ బ్రాంచ్‌ల వద్ద చేయొచ్చు. లేదా ఆర్‌ఐఎన్‌బీ, సీఐఎన్‌బీ, యోనో లైట్‌, యోనో, ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా చేయొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..