కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. !

| Edited By: Pardhasaradhi Peri

Oct 21, 2020 | 9:56 PM

కొత్తగా ఇళ్లు కొనుగోలుదారులకు పండుగ సందర్భంగా భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ గుడ్ న్యూస్ ప్రకటించింది.

కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. !
Follow us on

కొత్తగా ఇళ్లు కొనుగోలుదారులకు పండుగ సందర్భంగా భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ గుడ్ న్యూస్ ప్రకటించింది. గృహ రుణాల వడ్డీ రేటుపై 25 బేసిస్‌ పాయింట్ల వరకు రాయితీని ప్రకటిస్తూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇందుకోసం ఖాతాదారు ఎస్‌బీఐ డిజిటల్‌ లోన్ యాప్ యోనో ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అంతేకాదు, సిబిల్‌ స్కోరూ సంతృప్తికరంగా ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇక, తీసుకున్న గృహరుణం రూ.75 లక్షలకు పైబడి ఉండాలి. పండుగ ఆఫర్‌లో భాగంగా ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా, ఇటీవల రూ.30 లక్షల నుంచి రూ.రెండు కోట్ల మధ్య ఉన్న గృహరుణాలపై పది నుంచి ఇరవై బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ రాయితీని ప్రకటించింది. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు మరో ఎనిమిది మెట్రో నగరాల్లో రూ.మూడు కోట్ల వరకు గృహరుణాలపైనా ఇదే రకమైన రాయితీ ఉంటుందని వివరించింది. సాధారణంగా రూ.30 లక్షల వరకూ ఉన్న గృహరుణాలపై ఎస్‌బీఐ 6.9 శాతం వార్షిక వడ్డీని వసూలు చేస్తుండగా… అంతకు మించి ఉన్న రుణాలపై 7 శాతం వడ్డీని విధిస్తోంది.