వర్షాకాలంలో ఏసీతో పాటు ఫ్యాన్ వేస్తే ఇంత జరుగుతుందా.. ఇవి తెలిస్తే మళ్లీ ఆ తప్పు చెయ్యరు..

AC Tips: వర్షాకాలంలో ఏసీ ఆన్ చేసినా కూడా గదిలోని కొన్ని మూలల్లో ఉక్కపోత అలాగే ఉందా? అయితే మీరు ఏసీ వాడే విధానంలో ఒక పెద్ద తప్పు చేస్తున్నట్టే. ఏసీ వేసినప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ సైన్స్, ఎక్స్‌పర్ట్స్ చెప్పే మాట దీనికి పూర్తిగా విరుద్ధం. ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వర్షాకాలంలో ఏసీతో పాటు ఫ్యాన్ వేస్తే ఇంత జరుగుతుందా.. ఇవి తెలిస్తే మళ్లీ ఆ తప్పు చెయ్యరు..
Running Ac With Fan In Monsoon

Updated on: Jul 07, 2026 | 1:50 PM

వర్షాకాలం స్టార్ట్ అయింది.. బయట వానలు పడుతున్నా కూడా ఇంట్లో మాత్రం విపరీతమైన ఉక్కపోత, జిగట జనాలను పిండేస్తోంది. వర్షం పడే ముందు, పడిన తర్వాత వచ్చే ఈ చెమటల తలనొప్పి భరించలేక చాలా మంది ఇళ్లలో, ఆఫీసుల్లో వెంటనే ఏసీ ఆన్ చేస్తున్నారు. అయితే ఏసీ ఆన్ చేసినప్పుడు ఎవరైనా పొరపాటున ఫ్యాన్ స్విచ్ కూడా వేశారంటే చాలు..‘‘ బయటే వాతావరణం చల్లగా ఉంది, మళ్లీ ఫ్యాన్ ఎందుకు? ఏసీ గాలిని ఫ్యాన్ చెడగొడుతుంది’’ అంటూ ఇంట్లో వాళ్లు వెంటనే ఫ్యాన్ బంద్ చేయిస్తారు. గత కొన్నేళ్లుగా చాలా ఇళ్లలో ఏసీ, ఫ్యాన్ కలిపి వాడటంపై పెద్ద పెద్ద చర్చలే జరుగుతున్నాయి. మీరు కూడా అలాగే ఆలోచిస్తూ వర్షాకాలంలో ఫ్యాన్ ఆపేస్తున్నారా? అయితే మీరు పూర్తిగా తప్పులో కాలేసినట్టే.. నిజానికి ఈ వర్షాకాలం ఉక్కపోతలో మీ గదిలోని ఏసీ, సీలింగ్ ఫ్యాన్ రెండు కూడా బెస్ట్ ఫ్రెండ్స్‌లా పనిచేస్తాయి. వీటిని సరైన పద్ధతిలో కలిపి వాడితే.. గదిలోని జిగటతనం క్షణాల్లో పోతుంది, రూమ్ త్వరగా చల్లబడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా కరెంట్ బిల్లు కూడా భారీగా తగ్గుతుంది.

చల్లటి గాలిని గది అంతా వ్యాపింపజేసే ఫ్యాన్..

ఫ్యాన్ వేస్తే ఏసీ కూలింగ్ తగ్గిపోతుందని జనాలు అనుకుంటారు కానీ.. అసలు నిజం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఏసీ ఆన్ చేసినా కూడా గదిలోని కొన్ని మూలల్లో ఉక్కపోత అలాగే ఉంటుంది. కానీ ఏసీతో పాటు ఫ్యాన్ కూడా ఆన్ చేయగానే.. ఏసీ ఫిల్టర్ చేసిన చల్లటి, పొడి గాలి గదిలోని మూల మూలకూ చాలా వేగంగా విస్తరిస్తుంది. దీనివల్ల గదిలోని జిగటతనం మాయమై, రూమ్ మొత్తం చాలా త్వరగా కూల్ అవుతుంది.

ఏసీ టెంపరేచర్ 16 పెట్టాల్సిన అవసరం లేదు

వర్షాకాలంలో ఉక్కపోత ఎక్కువగా ఉందని చాలా మంది ఏసీ టెంపరేచర్‌ను నేరుగా 16 లేదా 18 డిగ్రీలలో సెట్ చేస్తుంటారు. కానీ ఏసీతో పాటు ఫ్యాన్ కూడా తిరుగుతుంటే.. అంత తక్కువ టెంపరేచర్ పెట్టాల్సిన పనే లేదు. ఫ్యాన్ గాలి వల్ల ఏసీ చల్లదనం గదిలో వేగంగా సర్క్యులేట్ అవుతుంది కాబట్టి.. మీరు ఏసీని 24 లేదా 26 డిగ్రీలలో ఉంచినా కూడా అద్భుతమైన కూలింగ్ అనుభూతిని పొందవచ్చు. దీనివల్ల ఏసీ కంప్రెసర్‌పై అదనపు భారం పడదు, కరెంట్ కూడా చాలా తక్కువగా కాలుతుంది.

ఫ్యాన్ వాడేటప్పుడు ఈ జాగ్రత్త తప్పనిసరి

యూట్యూబ్ లేదా సోషల్ మీడియాలో చాలా మంది చెప్పేటట్టు ఏసీతో పాటు ఫ్యాన్ వాడటం మంచిదే అయినప్పటికీ.. వర్షాకాలంలో ఒక చిన్న లిమిట్ ఉంది. వానాకాలంలో రాత్రంతా ఫ్యాన్‌ను ఫుల్ స్పీడ్‌లో పెట్టి ఏసీ రన్ చేస్తే.. గాలి బాగా డ్రైగా మారిపోయి, ఉదయం లేచేసరికి కొందరికి కళ్లు, గొంతు, ముక్కు ఎండిపోయినట్టు అనిపిస్తుంది. పైగా వర్షాకాలంలో బయట ఆల్రెడీ చల్లగా ఉంటుంది కాబట్టి.. ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్‌ను ఎప్పుడూ తక్కువ లేదా మీడియం స్పీడ్‌‌లో మాత్రమే ఉంచాలి. వీలైతే ఏసీలో ఉండే డ్రై మోడ్ ఆన్ చేసి ఫ్యాన్ వేసుకుంటే మరింత అద్భుతంగా పనిచేస్తుంది.

కరెంట్ బిల్లు ఎలా తగ్గుతుంది?

ఏసీ టెంపరేచర్‌ను కాస్త పెంచి, ఫ్యాన్‌ను తోడుగా వాడితే కరెంట్ బిల్లు అద్భుతంగా తగ్గుతుంది. ఒక అంచనా ప్రకారం.. ఏసీ టెంపరేచర్‌ను ప్రతి 1 డిగ్రీ పెంచినప్పుడల్లా దాదాపు 3శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. అంటే మీరు ఏసీని 20డిగ్రీలలో ఉంచేదానికంటే.. 24 లేదా 25 డిగ్రీలలో పెట్టి, లో స్పీడ్‌లో ఫ్యాన్ ఆన్ చేస్తే.. నెలాఖరుకు వచ్చే కరెంట్ బిల్లులో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. కాబట్టి.. ఈ వర్షాకాలం ఉక్కపోత నుండి ఉపశమనం పొందాలి, ఏసీ లైఫ్ పెరగాలి, అదే సమయంలో జేబుకు చిల్లు పడకుండా కరెంట్ బిల్లు అదుపులో ఉండాలంటే.. ఏసీతో పాటు ఫ్యాన్ ఆన్ చేయడం అనేది ఒక స్మార్ట్ ఐడియా.

Follow Us