బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. 24×7 ఆర్టీజీఎస్‌ సేవలు

|

Oct 09, 2020 | 1:24 PM

భారతీయ రిజర్వు బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త ప్రకటించింది. ఇకపై నగదు బదిలీకి సంబంధించిన ‘రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌’ ఆర్టీజీఎస్‌ సేవల్ని 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపింది.

బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. 24×7 ఆర్టీజీఎస్‌ సేవలు
Follow us on

భారతీయ రిజర్వు బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త ప్రకటించింది. ఇకపై నగదు బదిలీకి సంబంధించిన ‘రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌’ ఆర్టీజీఎస్‌ సేవల్ని 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇది డిసెంబరు నుంచి అమల్లోకి రానున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకుల పనిదినాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లావాదేవీలు చేసుకునేందుక ుఅవకాశముంది. ఇక గత డిసెంబరు 16 నుంచే నెఫ్ట్‌ సేవల్ని 24×7 అందిస్తున్న విషయం తెలిసిందే.

నగదు బదిలీ చేసేందుకు నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌ రెండు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఆర్‌బీఐ. ఆర్‌టీజీఎస్ విధానంలో కనీసం రూ. రెండు లక్షలు బదిలీ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులను బట్టి గరిష్ఠ మొత్తం ఆధారపడి ఉంటుంది. అదే నెఫ్ట్ విధానంలో కనీస పరిమితి అంటూ ఏమీ ఉండదు. మిగతా విధానాలతో పోలిస్తే నగదు బదిలీ వేగంగా జరగడమే వీటి ప్రత్యేకత. నెఫ్ట్‌లో సుమారు ప్రతి గంటకోసారి క్లియరెన్స్ ఉంటుంది. అంటే బదిలీ చేసిన నగదు.. అవతలి వారి ఖాతాలోకి గంటలోపు చేరుతుంది. క్లియరెన్స్ సమయాన్ని బట్టి కొన్ని సార్లు నిమిషాల వ్యవధిలో కూడా జరగొచ్చు. అదే ఆర్టీజీఎస్‌లో అయితే అప్పటికప్పుడే లావాదేవీ పూర్తవుతుంది. తాజాగా ఆర్‌బీఐ నిబంధనలు సడలించడంతో 24×7 ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇది డిసెంబర్ నుంచి అమలులోకి వస్తాయని ఆర్‌బీఐ తెలిపింది.