UPI Payments: యూపీఐ పేమెంట్స్‌లోనే విప్లవం.. ఇంటర్నెట్‌ లేకుండానే యూపీఐ చెల్లింపు

| Edited By: Ram Naramaneni

Dec 31, 2023 | 7:08 PM

యూపీఐ చెల్లింపులు చేయడానికి నగదును తీసుకెళ్లాల్సిన అవసరాన్ని పూర్తిగా తొలగించినంది. అయితే ఇవి డిజిటల్ చెల్లింపులు కాబట్టి పేలవమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రాంతాల్లో ఈ యూపీఐఈ యాప్‌లను ఉపయోగించి చెల్లింపులు చేయడం సమస్యగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక పరిష్కారాన్ని ప్రవేశపెట్టింది. ఎన్‌ పీసీఐ షార్ట్ యూఎస్‌ఎస్‌డీ కోడ్, ఇది ఇంటర్నెట్ లేకుండా కూడా డిజిటల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది.

UPI Payments: యూపీఐ పేమెంట్స్‌లోనే విప్లవం.. ఇంటర్నెట్‌ లేకుండానే యూపీఐ చెల్లింపు
Upi Payments
Follow us on

భారతదేశంలో 2016లో నోట్లు రద్దు చేసినప్పుడు ప్రత్యక్ష నగదు అవసరాన్ని తగ్గించడానికి తీసుకొచ్చిన యూపీఐ విధానం ప్రజాదారణ పొందింది. ముఖ్యంగా కరోనా సమయంలో ఈ విధానం కరోనా తగ్గింపులో బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూపీఐ యాప్‌లను ఉపయోగించి ఆన్‌లైన్‌ చెల్లింపులు చేయడం చాలా సులభమైంది. యూపీఐ చెల్లింపులు చేయడానికి నగదును తీసుకెళ్లాల్సిన అవసరాన్ని పూర్తిగా తొలగించినంది. అయితే ఇవి డిజిటల్ చెల్లింపులు కాబట్టి పేలవమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రాంతాల్లో ఈ యూపీఐఈ యాప్‌లను ఉపయోగించి చెల్లింపులు చేయడం సమస్యగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక పరిష్కారాన్ని ప్రవేశపెట్టింది. ఎన్‌ పీసీఐ షార్ట్ యూఎస్‌ఎస్‌డీ కోడ్, ఇది ఇంటర్నెట్ లేకుండా కూడా డిజిటల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. ఆ పరిష్కార వివరాలను ఓ సారి తెలుసుకుందాం. 

యూఎస్‌ఎస్‌ఎడీ కోడ్ అంటే? 

ఎన్‌పీసీఐ ద్వారా పరిచయం చేయబడిన సంక్షిప్త యూఎస్‌ఎస్‌డీ కోడ్ *99#. ఇది వివిధ బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించడానికి ఇంటర్నెట్ అవసరం లేని మొబైల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌గా ఉంది. ఇది తక్కువ నెట్‌వర్క్‌ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోని వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనంగా ఉంటుంది. కాబట్టి మన ఫోన్స్‌లో యూపీఐ చెల్లింపులను ఎలా సెటప్‌ చేయాలో? చూద్దాం

ఇవి కూడా చదవండి

ఆఫ్‌లైన్‌ యూపీఐ చెల్లింపులకు సెటప్‌ చేయడం ఇలా

  • మీ ఫోన్ డయలర్‌ను తెరిచి *99# డయల్ చేయాలి. 
  • ఆఫ్‌లైన్ యూపీఐ లావాదేవీలను ప్రారంభించడానికి, సంబంధిత విధులను నిర్వహించడానికి నంబర్ మిమ్మల్ని అనుమతిస్తుంది. 
  • డయల్ చేసిన తర్వాత మీరు ఇష్టపడే భాషను ఎంచుకోమని మెసేజ్‌ వస్తుంది. ఇందులో 13 భాషా ఎంపికలు ఉంటాయి. 
  • మీకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేదాన్ని ఎంచుకోవాలి. 
  • అనంతరం అందించిన టెక్స్ట్ ఫీల్డ్‌లో మీ బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్లోని నాలుగు అక్షరాలను నమోదు చేయాలి. 
  • సిస్టమ్ మీ ఫోన్ నంబర్ నమోదు చేసిన అన్ని ఖాతాల కోసం ఎంపికలను ప్రదర్శిస్తుంది. 
  • కావాల్సిన బ్యాంక్ ఖాతాను లింక్ చేయడానికి, ఆఫ్‌లైన్‌ చెల్లింపు ప్రక్రియను సెటప్ చేయడానికి సంబంధిత నంబర్ (“1” లేదా “2”)ని నమోదు చేయాలి.
  • ఈ  ప్రక్రియను పూర్తి చేయడానికి మీ డెబిట్ కార్డ్ చివరి ఆరు అంకెలు, గడువు తేదీని నమోదు చేయమని అడుగుతుంది. 
  • నమోదు చేసిన వివరాలన్నీ సరైనవైతే మీ ఆఫ్‌లైన్‌ యూపీఐ చెల్లింపు ఫీచర్ విజయవంతంగా సక్రియం చేస్తుంది. 

ఆఫ్‌లైన్ యూపీఐ చెల్లింపులు ఇలా

  • మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి *99# డయల్ చేయాలి. 
  • ఇంటరాక్టివ్ మెను కోసం మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.
  •  సెండ్ మనీ’ లేదా ‘ట్రాన్స్ఫర్ మనీ’ ఎంపికను ఎంచుకోండి.
  • లబ్ధిదారుని మొబైల్ నంబర్ లేదా వర్చువల్ చెల్లింపు చిరునామా నమోదు చేయాలి.
  • మీరు బదిలీ చేయాలనుకుంటున్న మొత్తాన్ని పేర్కొనాలి.
  • అనంతరం ప్రమాణీకరణ కోసం మీ యూపీఐ పిన్‌ను నమోదు చేసి, లావాదేవీ వివరాలను నిర్ధారించాలి. 
  • అనంతరం మీ యూపీఐ చెల్లింపు విజయవంతంగా ప్రాసెస్ అవుతుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..