ఉద్యోగులకు జీతాలు పెంచిన రెనాల్డ్ ఇండియా

|

Jun 04, 2020 | 11:37 AM

కరోనా ప్రభావంతో ఓ వైపు ఉద్యోగాలు ఊడుతుంటే...మరోవైపు జీతాల్లో కోతలు కొనసాగుతున్నాయి. అయితే ఫ్రెంచ్ కార్ల తయారీ కంపెనీ రెనాల్డ్ ఇండియా (RIPL) మాత్రం ఉద్యోగులపై వరాలు కురిపించింది.

ఉద్యోగులకు జీతాలు పెంచిన రెనాల్డ్ ఇండియా
Follow us on

Renault gives pay hike : కరోనా ప్రభావంతో ఓ వైపు ఉద్యోగాలు ఊడుతుంటే…మరోవైపు జీతాల్లో కోతలు కొనసాగుతున్నాయి. అయితే ఫ్రెంచ్ కార్ల తయారీ కంపెనీ రెనాల్డ్ ఇండియా (RIPL) మాత్రం ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ఆ సంస్థ ఉద్యోగులకు వెన్నుదన్నుగా నిలిచింది. ఉద్యోగులకు జీతాల పెంపుతోపాటు ప్రమోషన్లు కూడా ఇచ్చింది. సంస్థలో పనిచేస్తున్న 250 మంది ఉద్యోగుల జీతాలను 15 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. సంస్థ 2019లో కంపెనీ గణనీయమైన అభివృద్ధి సాధించిందని వెల్లడించింది. అయితే జీతాల పెంపు నుంచి తన భాగస్వాములైన నిస్సాన్, రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజీ బిజినెస్ సెంటర్ ఇండియాను మినహాయించినట్లుగా తెలిపింది. ఇక రాబోయే ఫెస్టివల్ సీజన్‌లో ఎస్‌యూవీ(SUV) అమ్మకాలు ఆశాజనకంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేసింది.