RBI: మళ్లీ పెరగనున్న లోన్ ఈఎంఐలు..! న్యూఇయర్‌కు ముందే మరో పిడుగు.. సామాన్యులకు కష్టమే..

లోన్లు తీసుకున్నవారికి పిడుగులాంటి వార్త. డిసెంబర్‌లో మరోసారి వడ్డీ రేట్లు పెరిగే అవకాశముంది. ఆర్బీఐ మరోసారి వచ్చే నెలలో రెపో రేటును పెంచనుందని ఎస్బీఐ తన నివేదికలో తెలిపింది. ఇదే జరిగితే ఫ్లోటింగ్ రేటుతో లోన్లు తీసుకున్నవారికి ఈఎంఐలు మరింత భారం కానున్నాయి.

RBI: మళ్లీ పెరగనున్న లోన్ ఈఎంఐలు..! న్యూఇయర్‌కు ముందే మరో పిడుగు.. సామాన్యులకు కష్టమే..
Rbi

Updated on: Nov 16, 2026 | 4:31 PM

గత నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. గత నెలలో జరిగిన ద్రవ్య విధాన పరపతి సమీక్షలో రెపో రేటును 0.25 శాతం పెంచింది. దీంతో వడ్డీ రేట్లు 5.25 శాతం నుంచి 5.50 శాతానికి చేరుకున్నాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచగా.. దీని వల్ల లోన్లు తీసుకున్నవారికి నెలవారీ ఈఎంఐలు పెరగడం వల్ల వారిపై భారం పడుతోంది. అయితే ఈ క్రమంలో ఈఎంఐలు చెల్లించేవారికి షాకిస్తూ మరో వార్త వినిపిస్తోంది. వడ్డీ రేట్లను డిసెంబర్‌లో మరోసారి పెంచే అవకాశముందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన ఆర్ధిక నివేదికలో అంచనా వేసింది.

వచ్చే నెలలో మరోసారి పెంపు..?

డిసెంబర్‌లో ఆర్బీఐ ద్రవ్య విధాన పరపతి సమీక్ష సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో రెపో రేటును మరో 0.25 బేసిస్ పాయింట్లు పెంచే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, రూపాయి బలహీనపడటం, ముడి చమురు ధరల్లో మార్పుల క్రమంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని ఎస్బీఐ తన నివేదికలో పేర్కొంది. నవంబర్‌లో ద్రవ్యోల్బణం 6 శాతానికి చేరుకునే అవకాశముందని అంచనా వేసిన ఎస్బీఐ.. ఆ తర్వాత తగ్గే ఛాన్స్ ఉందని అభిప్రాయపడింది. రూపాయి విలువ క్షీణిస్తుండటంతో దీనిని కట్టడి చేసేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. రెపో రేట్లను పెంచడం వల్ల ఫ్లోటింగ్ ఆధారిత వడ్డీ రేట్లు పెరుగుతాయి. దీని వల్ల ఫ్లోటింగ్ రేటుతో లోన్లు తీసుకున్నవారికి ఈఎంఐలు మరింత పెరుగుతాయి. దీని వల్ల ఈఎంఐలు మరింత చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హోమ్ లోన్లు ఫ్లోటింగ్ రేటుతో ముడిపడి ఉంటాయి. దీంతో గృహ రుణాలు తీసుకున్నవారికి ఇది చేదువార్తగా చెప్పవచ్చు. అయితే దీని వల్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారికి అధిక ఆదాయం లభించనుండగా.. కొత్తగా లోన్లు తీసుకునేవారికి కూడా నష్టం చేకూరుస్తుంది. వడ్డీ రేట్లు పెరగడం వల్ల అధిక వడ్డీతో లోన్లు తీసుకోవాల్సి ఉంటుంది.

క్షీణిస్తున్న రూపాయి.. ఆర్బీఐ చర్యలు

కాగా ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయాలు రూపీ విలువ క్షీణించకుండా చేయడంలో సహాయపడుతున్నాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ 94 కంటే దిగువకు చేరుకుంది. దీని వల్ల నగదు లభ్యతపై ఒత్తిడి కూడా తగ్గిందని చెప్పవచ్చు. అక్టోబర్‌ చివరి వారంలో 5.8 శాతానికి చేరిన కాల్‌ మనీ రేటు.. తర్వాత మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటు 5.44 శాతం కంటే దిగువకు తగ్గిందని ఎస్బీఐ తన ఆర్ధిక నివేేేేేేేేేేేేేేేేేేేేేదికలో పొందవుర్చింది.

Loading...
Unable to load recommendations.
Follow Us