RBI: ఆన్‌లైన్‌ మోసాలకు చెక్‌ పెట్టే దిశగా ఆర్‌బీఐ అడుగులు.. ఇకపై ఓటీపీలు రావా.?

|

Feb 11, 2024 | 8:40 PM

ఎస్‌ఎంఎస్‌ ఆధారంగా వచ్చే వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ ప్రామాణీకరణను తొలగించడానికి ఆర్బీఐ సిద్ధమైంది. దీనికి సంబంధించి ఆర్బీఐ ప్రస్తుతానికి ఎటువంటి వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేయలేదు కానీ తమ వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 8న విడుదల చేసిన డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై...

RBI: ఆన్‌లైన్‌ మోసాలకు చెక్‌ పెట్టే దిశగా ఆర్‌బీఐ అడుగులు.. ఇకపై ఓటీపీలు రావా.?
Rbi
Follow us on

దేశంలో డిజిటల్‌ చెల్లింపులను శరవేగంగా పెరుగుతున్నాయి. యూపీఐ పేమెంట్స్‌ మొదలు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వరకు క్రయవిక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. పెరుగుతోన్న లావాదేవీలతో పాటు మోసాలు సైతం పెరుగుతున్నాయి. ఓటీపీ ఫ్రాడ్‌ వంటి ఎన్నో మోసాలు రోజూ వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయడానికి అడిషనల్‌ ఫ్యాకర్ట్ అథెంటికేషన్ అంశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఎస్‌ఎంఎస్‌ ఆధారంగా వచ్చే వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ ప్రామాణీకరణను తొలగించడానికి ఆర్బీఐ సిద్ధమైంది. దీనికి సంబంధించి ఆర్బీఐ ప్రస్తుతానికి ఎటువంటి వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేయలేదు కానీ తమ వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 8న విడుదల చేసిన డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై స్టేట్‌మెంట్‌లో దీన్ని ప్రస్తావించింది. ప్రస్తుతం మనం ఏదైనా డిజిటల్‌ లావాదేవీ నిర్వహించిన సమయంలో రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుందనే విషయం తెలిసిందే. ఈ ఓటీపీ ఎంటర్‌ చేస్తే ట్రాన్సాక్షన్‌ పూర్తవుతుంది.

తప్పుడు లావాదేవీలు జరగకుండా ఉండడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే లావాదేవీ పూర్తవుతుంది. దీంతో అథెంటికేషన్‌ లభిస్తుంది. బ్యాంక్ ఖాతాల భద్రతను నిర్ధారించడానికి, చట్టవిరుద్ధంగా పొందిన ఆర్థిక డేటా దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఈ అడిషనల్‌ ఫ్యాక్టర్‌ ఆథెంటికేషన్‌ ( AFA ) ఒక కీలక దశ. ఆర్‌బీఐ నిర్దిష్ట ఏఎఫ్‌ఏని నిర్దేశించనప్పటికీ చెల్లింపుల వ్యవస్థ ఎక్కువగా ఎస్‌ఎంఎస్‌-ఆధారిత వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని అనుసరిస్తోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం టెక్నాలజీ మారుతోన్న క్రమంలో ప్రత్యామ్నాయం మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ రాకుండా మెషిన్స్‌కు కూడా ఓటీపీలు వచ్చే విధానం అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే డిజిటల్ చెల్లింపు లావాదేవీల ప్రామాణీకరణ కోసం ఇటువంటి యంత్రాంగాల వినియోగాన్ని పరిశీలించాలని ఆర్బీఐ సూత్ర ప్రాయ ప్రతిపాదనలు చేసింది.

ఆధార్‌ ఎనేబుల్డ్‌ సిస్టమ్‌కు సంబంధించిన ప్రతిపాదనలూ చేసింది. బ్యాంకులు అనుసరించాల్సిన AePS టచ్‌పాయింట్ నిర్వాహకుల కోసం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. అలాగే మోసాలను నిరోధించే చర్యలను సైతం పరిగణననలోకి తీసుకోవాలని సూచించింది. గతేడాది ఈ ఆధార్‌ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా 37 కోట్ల మంది లావాదేవీలు నిర్వహించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..