RBI: ఆర్బీఐ పేరుతో ఈ మెస్సేజ్ మీకు వచ్చిందా..? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..

ఆర్బీఐ దేశ ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఆర్బీఐ పేరుతో ఓ నకిలీ మెయిల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆర్బీఐ కొత్త పథకం ప్రారంభించిందని, లాటరీ ద్వారా డబ్బులు సంపాదించవచ్చంటూ నకిలీ మెయిల్స్ వస్తున్నాయి. దీనిపై ఆర్బీఐ స్పందించి క్లారిటీ ఇచ్చింది.

RBI: ఆర్బీఐ పేరుతో ఈ మెస్సేజ్ మీకు వచ్చిందా..? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..
Money

Updated on: May 27, 2026 | 9:01 AM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ ప్రజలకు కీలక అలర్ట్ జారీ చేసింది. ఆర్బీఐ పేరుతో సోషల్ మీడియా, ఈమెయిల్స్ రూపంలో వచ్చే తప్పుడు మెస్సేజ్‌లపై ప్రజలను అప్రమత్తం చేసింది. క్రెడిట్ ఫీజులు లేదా లాటరీ గెలిచినందుకు పరిహారం పొందేందుకు ‘విరాళ కార్యక్రమం 2026’ కింద డబ్బు విరాళంగా అందించాలని సోషల్ మీడియాలో మెస్సేజ్‌లు వస్తున్నాయి. ఆర్బీఐ పేరుతో రావడంతో చాలామంది ఇది నిజమేనని నమ్ముతున్నారు. దీంతో ఆర్బీఐ స్పందించి ప్రజలకు క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే సందేశం నకిలీదని తెలిపింది. ఆర్బీఐ అటువంటి పథకాన్ని ఏదీ ప్రారంభించలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది.

ఆర్బీఐ పేరుతో నకిలీ ఈమెయిల్స్

ఆర్బీఐ ఎలాంటి లాటరీ పథకాన్ని ప్రారంభించలేదని పీఐబీ ఫ్యాక్ట్స్ చెక్ టీమ్ తెలిపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యలేట్ అవుతున్న ఇమెయిల్ ప్రజలను మోసం చేసి డబ్బు లేదా సున్నితమైన ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి ఉద్దేశించినది అని తెలిపింది. ఆర్బీఐ అటువంటి విరాళ కార్యక్రమం, లాటరీ పరిహారం, లెగసీ ఫండ్ లేదా సంబంధిత పథకాన్ని ఏదీ ప్రవేశపెట్టలేదని స్పష్టం చేసింది. ముందుగా డబ్బలు చెల్లించాలని, ప్రాసెసింగ్ ఛార్జీలకు బదులుగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని ఆఫర్ చేసే ఇమెయిల్‌లు లేదా సందేశాలను నమ్మవద్దని హెచ్చరించింది. ఆర్బీఐ ఎప్పుడూ అలాంటి ఇమెయిల్స్ పంపదని, అలాంటి పథకాలను నిర్వహించదని పేర్కొంది.

వ్యక్తిగత సమాచారం ఇవ్వకండి

సదరు మెయిల్‌లో బ్యాంక్ అకౌంట్ నెంబర్, IFSC కోడ్, పూర్తి పేరు, అడ్రస్, మొబైల్ నంబర్, వాట్సాప్ నంబర్, గుర్తింపు రుజువు కాపీ వంటివి అడుగుతున్నారు. ఇలాంటి వ్యక్తిగత సమాచారాన్ని తెలియని వ్యక్తులు, సంస్థలతో షేర్ చేసుకోవద్దని, నకిలీ లింకులపై క్లిక్ చేయవద్దని సూచించింది. కేంద్ర ప్రభుత్వ, సంస్థల పేరుతో చలామణి అయ్యే నకిలీ లింకులు, సమాచారంపై 8799711259 వాట్సప్ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించింది. లేదా factcheck@pib.gov.inకు ఈమెయిల్ చేయాలని పేర్కొంది.

Follow Us