Ration Card: రేషన్ కార్డులో కొత్త వ్యక్తి పేరు చేర్చడం చాలా సింపుల్.. ఆన్‌లైన్‌లోనే సులువుగా ఇలా.. పూర్తి ప్రాసెస్ ఇదే..

రేషన్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. ఈ కార్డు లేకపోతే మీకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సంక్షేమ పథకాల రూపంలో అందదు. అయితే కొత్తగా రేషన్ కార్డులో పేర్లను చేర్చడం ఎలా అనే విషయం చాలామందికి తెలియదు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.

Ration Card: రేషన్ కార్డులో కొత్త వ్యక్తి పేరు చేర్చడం చాలా సింపుల్.. ఆన్‌లైన్‌లోనే సులువుగా ఇలా.. పూర్తి ప్రాసెస్ ఇదే..
Ration Card

Updated on: Aug 08, 2026 | 4:29 PM

రేషన్ కార్డు అనేది ప్రతీఒక్కరికీ అత్యంత అవసరమైన గుర్తింపు ధృవీకరణ పత్రం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేదా రాయితీలు, సబ్సిడీలు అందుకోవాలంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరి. ఇది లేకపోతే మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందుకోలేరు. కేవలం రేషన్ సరుకులు మాత్రమే తీసుకోవడానికే కాకుండా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే పెళ్లి అయిన తర్వాత భార్య పేరుతో పాటు పిల్లల పేర్లను రేషన్ కార్డులో చేర్చాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ఏంటి అనేది చాలామందికి తెలియక దరఖాస్తు చేసుకోరు. అయితే రేషన్ కార్డులో కొత్త పేర్లు ఎలా చేర్చాలి..? ఈ ప్రాసెస్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఏయే డాక్యుమెంట్స్ అవసరం?

పెళ్లి అయిన తర్వాత భార్య పేరు రేషన్ కార్డులో చేర్చాలంటే ఆమె ఆధార్ కార్డు అవసరం. ఇక మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి. ఇక పిల్లల పేర్లు చేర్చాలంటే డేట్ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. రేషన్ కార్డులో భార్య, పిల్లల పేర్లు చేర్చడానికి ఈ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి.

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

-తెలంగాణలో నివసించే ప్రజలు సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లాలి

-ఎఫ్‌ఎస్‌సీ (FSC) కరెక్షన్​ ఫారం తీసుకుని అందులో వివరాలు నింపాలి

-ఈఫారంలో మొదటి కాలంలో మీ రేషన్ కార్డు నెంబర్ రాయాలి

-ఆ తర్వాత మెంబర్ ఎడిషన్ బాక్సులో రైట్ మార్క్ క్లిక్ చేసి కొత్తగా ఎవరి పేర్లు చేర్చాలనుకుంటున్నారో వారి అడ్రస్, పేర్లు, ఆధార్ నెంబర్ వివరాలు రాయాలి

-అనంతరం అవసరమైన ధృవీకరణ పత్రాలను అప్లికేషన్ ఫారంకు జోడించి మీ సేవలో అందించాలి
-మీ సేవా నిర్వాహకులు ఇచ్చే రసీదు ఫారం తీసుకోవాలి

-రసీదు ఫారంలో ఉండే అప్లికేషన్ ఆధారంగా ఆన్‌లైన్‌లో స్టేటస్ తెలుసుకోవచ్చు

స్టేటస్ తెలుసుకోవడం ఎలా?

https://epds.telangana.gov.in/FoodSecurityAct/ పోర్టల్‌కు వెళ్లాలి

– హోమ్ పేజీలో​ ‘FSC Search’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

-Ration Cards Search అనే ఆప్షన్ ఎంచుకోవాలి

-ఆ తర్వాత FSC Application Search ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

-మీ జిల్లా, మీ అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయాలి

-అనంతరం సెర్చ్ మీద క్లిక్​ చేస్తే స్టేటస్​ కనిపిస్తుంది.

-ఇప్పటికే ఉన్న మీ రేషన్​ కార్డు వివరాలను చూసుకోవాలంటే.. FSC Search మీద క్లిక్​ చేసి వివరాలు అందించాల్సి ఉంటుంది.

ఏపీలో ప్రాసెస్ ఎలా..

ఏపీ ప్రజలు తమ పరిధిలోకి వచ్చే గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి రేషన్ కార్డులో మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఏపీ ప్రభుత్వ వాట్సప్ గవర్నెన్స్ నెంబర్ ద్వారా కూడా వాట్సప్‌లో దారఖాస్తు చేసుకోవచ్చు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us