Savings Accounts: కస్టమర్లకు షాకిచ్చిన ఆ బ్యాంక్.. సేవింగ్స్ ఎకౌంట్స్ పై వడ్డీరేట్లు తగ్గింపు!

|

Nov 23, 2021 | 4:16 PM

దేశంలోనే రెండో అతి పెద్ద బ్యాంకు

Savings Accounts: కస్టమర్లకు షాకిచ్చిన ఆ బ్యాంక్.. సేవింగ్స్ ఎకౌంట్స్ పై వడ్డీరేట్లు తగ్గింపు!
Savings Account
Follow us on

Savings Accounts: దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఖాతాదారులకు షాకిచ్చింది. సేవింగ్స్ ఖాతాపై వడ్డీ రేట్లను తగ్గించాలని బ్యాంక్ నిర్ణయించింది. సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లను ఏడాదికి 2.90 నుంచి 2.80%కి తగ్గించాలని బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

ఎంత బ్యాలెన్స్‌పై ఎంత వడ్డీ లభిస్తుందో తెలుసా?

1 డిసెంబర్ 2021 నుండి అమలులోకి వచ్చేలా, సేవింగ్స్ ఖాతాలో10 లక్షల కంటే తక్కువ ఉన్నట్లయితే బ్యాలెన్స్‌పై వడ్డీ రేటు సంవత్సరానికి 2.80% ఉంటుంది. అదే సమయంలో, 10 లక్షలు..అంతకంటే ఎక్కువ ఉన్న పొదుపు ఖాతాపై, వార్షిక వడ్డీ రేటు 2.85% ఉంటుంది. ఇప్పటి వరకు సేవింగ్స్ డిపాజిట్‌పై 2.90% వార్షిక వడ్డీ బ్యాంకు ఇస్తోంది.

సేవింగ్స్ ఖాతాపై ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తోంది

బ్యాంక్

వడ్డీ రేటు (%)
RBL బ్యాంక్ 4.25-6.00
బంధన్ బ్యాంక్ 3.00-6.00
యస్ బ్యాంక్ 4.00-5.25
ఇండస్సిండ్ బ్యాంక్ 4.00-5.00
IDFC ఫస్ట్ బ్యాంక్  4.00-5.00
తపాలా కార్యాలయము 4.00
ICICI బ్యాంక్ 3.00-3.50
HDFC బ్యాంక్ 3.00-3.50
బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.90
SBI 2.70

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA కింద పొదుపు ఖాతాపై వచ్చే వడ్డీపై కూడా పన్ను చెల్లించాలి. బ్యాంకు పొదుపు ఖాతా విషయంలో, వడ్డీ ద్వారా సంవత్సరానికి10,000 రూపాయల వరకు ఆదాయం పన్ను రహితం. ఈ ప్రయోజనం 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తికి అందుబాటులో ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు ఈ మినహాయింపు 50 వేల రూపాయలు. ఇంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే టీడీఎస్‌ మినహాయిస్తారు. వడ్డీ ఆదాయం నిర్దేశిత మినహాయింపు పరిమితిని మించి ఉంటే 10% TDS బ్యాంకులోనే మినహాయించి మిగిలిన సొమ్ము వెనక్కి ఇస్తారు.

ఇవి కూడా చదవండి: Vodafone Idea Tariff Hike: కస్టమర్లకు షాకివ్వనున్న వొడాఫోన్ ఐడియా.. భారం కానున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు.. ఎప్పటి నుంచో తెలుసా?

Joker Virus: యూజర్లు అలర్ట్.. జోకర్‌ వైరస్‌ మళ్లీ వచ్చింది.. మీ ఫోన్‌లో ఈ 15 యాప్స్‌ ఉంటే వెంటనే తొలగించండి