బైక్, కార్లున్నవారికి కేంద్రం బిగ్ రిలీఫ్.. పొల్యూషన్ సర్టిఫికేట్ గడువు పెంపు.. ఎన్ని రోజులంటే..?

Puc Certificate Validity: బైక్, కార్లకు పొల్యూషన్ సర్టిఫికేట్లకు సంబంధించి కేంద్రం కీలక మార్పులు చేసింది. పలు వాహనాలకు ఊరట కల్గించగా.. మరికొన్ని వాహనాలకు నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు నవంబర్ 19వ తేదీన కొత్త రూల్స్ నోటిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త రూల్స్ ఏంటనేది చూద్దాం,.

బైక్, కార్లున్నవారికి కేంద్రం బిగ్ రిలీఫ్.. పొల్యూషన్ సర్టిఫికేట్ గడువు పెంపు.. ఎన్ని రోజులంటే..?
Pollution Certificate

Updated on: Nov 19, 2026 | 6:19 PM

వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి. ఈ సర్టిఫికేట్‌కు ఒక గడువు ఉంటుంది. ఈ గడువు తర్వాత మళ్లీ తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని వాహనాలకు ఒకేలా పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ గడువు ఉండదు. ఒక్కొ వాహనానికి ఒక్కొ విధంగా ఈ గడువును నిర్ణయించారు. తాజాగా ఈ గడువుల్లో కేంద్రం ప్రభుత్వం పలు సవరణలు చేసింది. నవంబర్ 19వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు సెంట్రల్ మోటార్ వెహికల్స్ సవరణ నిబంధలను నోటిఫై చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 19వ తేదీ నుంచి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ కొత్త మార్పుల్లో బీఎస్-6 వాహనాలకు బిగ్ రిలీఫ్ అందించింది.

వ్యక్తిగత భారత్ స్టేజ్-6(BS-VI Non Transport) వాహనదారులకు కేంద్రం ఊరట కల్పించింది. ఇకపై ప్రతీ సంవత్సరం పొల్యూషన్ సర్టిఫికేట్ రెన్యూవల్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. మూడేళ్ల పాటు సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే పాత బీఎస్-1, బీఎస్-2, బీఎస్-3 వాహనదారులు షాకిచ్చింది. కేవలం మూడు నెలలకు మాత్రమే పరిమితం చేసింది.ఈ మేరకు బీఎస్-4 కంటే తక్కువ స్థాయి వాహనాలకు 3 నెలల గడువు విధించింది.

కొత్త రూల్స్ ఇవే..

-2020 ఏప్రిల్ తర్వాత కొనుగోలు చేసిన బీఎస్-6 వ్యక్తిగత వాహనాలకు ఇప్పటివరకు ఏడాది చెల్లుబాటు తర్వాత మళ్లీ రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉండేది. ఇప్పుడు దీనిని మూడేళ్లు చెల్లుబాటు అయ్యేలా రూల్స్ మార్చారు. వాహనం రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి ఆరేళ్ల వరకు ప్రతీ మూడేళ్లకు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఆరేళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ప్రతీ సంవత్సరం తీసుకోవాలి. 10 ఏళ్ల తర్వాత ప్రతీ 6 నెలలకు సర్టిఫికేట్ తీసుకోవాలి

-బీఎస్ 1,2,3,4 వాహనాలకు ఇప్పటివరకు ప్రతీ 6 నెలలకు ఒకసారి పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వచ్చేది. ఇక నుంచి బీఎస్-1,2,3 వాహనదారులు ప్రతీ 3 నెలలకు తీసుకోవాలి. బీఎస్-4 వాహనాలకు 6 నెలలుగా నిర్ణయించింది

-బీఎస్-4 కమర్షియల్ వెహికల్స్‌కు ప్రతీ 6 నెలలకు ఒకసారి తీసుకోవాలి

-బీఎస్-6 ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు రిజిస్ట్రేషన్ నుంచి 6 ఏళ్ల వరకు రెండేళ్లకు ఒకసారి సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోవాలి. ఆరు నుంచి 10 ఏళ్ల మధ్య ఏడాదికి ఒకసారి తీసుకోవాలి. ఆ తర్వాత ఆరు నెలలకు ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది.

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us