EPFO: మీకు పీఎఫ్ వడ్డీ జమ అయిందా..? లేదా..? ఈ స్టెప్స్ ఫాలో అయితే తెలుసుకోవడం ఈజీ..

ఈపీఎఫ్ఓ శుభవార్త అందించింది. పీఎఫ్ వడ్డీని ఖాతాదారుల అకౌంట్లో జమ చేస్తోంది. ఈ నెల 15వ తేదీలోపు అందరి ఖాతాల్లో వేయనుంది. అయితే ఇప్పటికే చాాలామంది ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. అయితే వడ్డీ జమ అయిందా.. లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే..?

EPFO: మీకు పీఎఫ్ వడ్డీ జమ అయిందా..? లేదా..? ఈ స్టెప్స్ ఫాలో అయితే తెలుసుకోవడం ఈజీ..
Epfo

Updated on: Jul 08, 2026 | 2:43 PM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) పీఎఫ్ వడ్డీని జమ చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ఖాతాల్లో జమ అవుతుండగా.. ఈ నెల 15వ తేదీ నాటికి అందరి అకౌంట్లలో వేయనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 2026 మార్చిలో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును ఫిక్స్ చేసింది. వడ్డీ ఎప్పుడెప్పుడు జమ అవుతుందా? అని ఖాతాదారులు ఎదురుచూస్తుండగా.. మూడు నెలల తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు నిరీక్షణకు తెరపడింది. పీఎఫ్ వడ్డీ ప్రస్తుతం జమ అవుతుండగా.. అందరికి జమ చేయడానికి ఈ నెల 15వ తేదీ వరకు సమయం పట్టనుంది. కొంతమంది చందాదారుల ఖాతాలకు వడ్డీ ఇంకా జమ కాలేదు. కొంతమందికి ఇప్పటికే జమ అయింది. అయితే పీఎఫ్ వడ్డీ మీకు పడిందా..? లేదా? అనేది ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వడ్డీ జమ అయిందా.. లేదా అని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్ఓ పోర్టల్, మిస్డ్ కాల్, ఎస్‌ఎంఎస్ సేవల ద్వారా తెలుసుకోవచ్చు.

పోర్టల్ ద్వారా తెలుసుకోవడం ఎలా..?

-https://www.epfindia.gov.in/site_en/ వెబ్‌సైట్ తెరవండి

-సర్వీసెస్ కేటగిరీ ఎంచుకోండి

-ఫర్ ఎంప్లాయిస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-మెంబర్ పాస్ బుక్ ఆప్షన్ ఎంచుకోండి

-యూఏఎన్ నెంటర్, పాస్ వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి

-మీ ప్రస్తుత కంపెనీని ఎంచుకోండి

-పీఎఫ్ వడ్డీ ఎంత జమ అయింది అనేది అక్కడ ప్రింట్ అయి ఉంటుంది.

-పీఎఫ్ సభ్యులు పాస్‌బుక్‌లో సాధారణంగా చివరి ఎంట్రీని చెక్ చేయాలి.“వడ్డీ 31/03/2026 వరకు అప్డేట్ చేయబడింది అని రాసి ఉంటుంది.

ఉమాంగ్ యాప్ ద్వారా చెక్ చేసుకోవడం ఎలా..?

-గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లండి

-ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

-మొబైల్ నెంటర్‌తో లాగిన్ అవ్వండి

-ఈపీఎఫ్ఓ అని సెర్చ్ చేయండి

-ఈపీఎఫ్ఓ సర్వీసులను ఎంచుకోండి

-పాస్ బుక్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి

-యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయండి

-మీ పాస్ బుక్ వివరాలు కనిపిస్తాయి. అందులో బ్యాలెన్స్ తనిఖీ చేయండి

మిస్డ్ కాల్ ద్వారా చెక్ చేసుకోవడం ఎలా..?

ఈపీఎఫ్ఓ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 9966044425 నెంబర్‌కు కాల్ చేయండి. రెండు రింగ్స్ తర్వాత కాల్ కట్ అవుతుంది. అనంతరం ఆటోమేటిక్‌గా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు మీ ఫోన్‌కు టెక్ట్స్ మెస్సే్జ్ రూపంలో వస్తాయి.

ఎస్‌ఎంఎస్ ద్వారా చూసుకోవడం ఎలా..?

EPFOHO (UAN నెంబర్) ENG అని టైప్ చేసి 7738299899 నెంటర్‌కు మెస్సేజ్ చేయండి. మీ బ్యాలెన్స్ వివరాలు మీకు టెక్ట్స్ రూపంలో అందుతాయి.

Follow Us